Gruhalakshmi August 6th Update: తప్పు ఒప్పుకున్న అనసూయ - తులసి విషయంలో నందుకు వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్
నందు, లాస్య, తులసి కుటుంబం అంతా సామ్రాట్ ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. సామ్రాట్ తులసితో క్లోజ్ గా ఉండటాన్ని చూసి నందు తట్టుకోలేకపోతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మీ గొంతు ఎవరికి వినపడకుండా చాలా పెద్ద తప్పు చేశారు. చాలా గొప్ప పేరు రావలసిన మీరు మీ గొంతుని నాలుగు గోడల మధ్యే ఉండిపోయేలా ఎందుకు చేశారు అని సామ్రాట్ తులసిని అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్ లో.. తనకి సినిమాల్లో పాట పాడే అవకాశం ఇస్తాను అన్న విషయం తులసి నందుకు చెప్తుంది. నీకు ఏం తక్కువ చేశాను అని ఇప్పుడు పాటలు పాడి నా పరువు బజారున పడేయాలని అనుకుంటున్నావా. ముగ్గురు పిల్లల తల్లివి అయి ఉండి సంసారాన్ని గాలికి వదిలేసి సినిమాలు పాటలు అని తైతక్కలాడదామనా కుదరదు అని నందు చెప్పిన విషయం గుర్తు తులసి గుత్తు చేసుకుంటుంది. తులసి పాట నాలుగు గోడల మధ్య ఉండిపోవడానికి ఒక విధంగా మేము కూడా కారణమని పరంధామయ్య అంటాడు. నేను అందరి అత్తలు మాదిరిగానే చేశాను. కోడలిని జైల్లో బంధిగా చేశాను నేను చెప్పిన మాట అది వినాలనుకున్నానే తప్ప తన మనసులో ఆలోచనలు ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. నేను ఎంత కష్టపెట్టిన నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంది. పాత కాలపు ఆలోచనలతో మా కోడలి ఎదుగుదలకి అడ్డుపడ్డాం ఇక మీదట అలా జరగదని అనసూయ తన తప్పు ఒప్పుకుంటుంది. మా కోసం తను ఎంతో కష్టపడిందని పరంధామయ్య కూడా తులసి గొప్పతనాన్ని పొగుడుతాడు. ఈ విషయంలో తులసి కుటుంబ సభ్యుల మధ్య వాదన కాసేపు జరుగుతుంది.
ఏంటో గాని ఈ రోజు పార్టీ పెట్టిన ముహూర్తం బాగోలేదనుకుంటా ఏం స్టార్ట్ చేసిన అది ఎక్కడికో వెళ్తుంది అని సామ్రాట్ అంటాడు. మీ మామ్ ని మొదటి నుంచి ఎంకరేజ్ చేసి ఉంటే గొప్ప సింగర్ అయ్యి ఉండేది కదా అన్నాను అంతే అని సామ్రాట్ అంటాడు. భార్య ఎదగాలి అంటే భర్త సపోర్ట్ ఉండాలి అని సామ్రాట్ బాబాయ్ అంటాడు. తులసి విషయంలో ఆయన భర్త ప్రాబ్లం ఏంటో మనకి ఎలా తెలుస్తుందని లాస్య పుల్ల వేస్తుంది. బయట నుంచి మనం కామెంట్ చెయ్యకూడదు నిజం ఏంటో చెప్పగలిగేది తులసి ఒక్కటే. నీ లాంటి మంచి భార్యని ఎందుకు వదిలేశాడు, మీ మధ్య ఏం జరిగిందని సామ్రాట్ బాబాయ్ తులసిని అడుగుతాడు. నేనే తన మాజీ భర్తని అని తులసి బయట పెట్టేస్తుందేమో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని నందు టెన్షన్ పడతాడు. తులసి కోపంగా నందు వైపు చూస్తుంటే తను ఏం చెప్పిద్దా అని అందరూ కంగారు పడతారు.
సామ్రాట్ గారు పార్టీకి పిలిచినందుకు చాలా థాంక్స్ వెళ్లొస్తామని చెప్పి తులసి వాళ్ళు వెళ్లిపోతారు. లాస్య నందు వాళ్ళు కూడా వెళ్లిపోతారు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలా బాబాయ్ అని సామ్రాట్ అంటాడు. చూడు తులసి గారు హార్ట్ అయ్యి వెళ్లిపోయారు మనకి అవసరమా అని అంటాడు. తులసి లాస్య అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటే ప్రేమ్, పరంధామయ్య ఓదారుస్తారు. దేవుడు ఎందుకు నేను వద్దనుకున్న మనిషితోనే ముడి పెడుతున్నాడు, విడాకులు తీసుకున్నా నాకు ఈ బాధ తప్పడం లేదు ఎందుకిలా.. ఏదో మ్యూజిక్ స్కూల్ పెట్టుకుని నా జీవితం మార్చుకుందామని అనుకుంటే అందులో కూడా ఆయన జోక్యం జరుగుతుంది ఎందుకు అని తులసి చాలా బాధపడుతుంది. నీకు నువ్వే నీ గతాన్ని మెడలో వేసుకుని తిరుగుతూ ఎందుకమ్మా ఆ దేవుడిని నిందిస్తున్నావ్ అని పరంధామయ్య అంటాడు. నువ్వు నందు నుంచి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావ్ నువ్వేమి తప్పు చెయ్యలేదు కదా పారిపోవాల్సింది నువ్వు కాదు నా కొడుకు.. దేవుడు నీ చుట్టూనే తిరుగుతున్నాడు నీ ఎదుగుదల చూసి నందు కుళ్ళుకుంటున్నాడని తులసికి ధైర్యం చెప్తాడు. నందు మీద నువ్వు గెలవాలి అందుకే దేవుడు వాడు నీ పక్కనే ఉండేలా చేస్తున్నాడు. దేవుడు ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నాడని చెప్తాడు.
Also Read: విషం తాగబోయిన దేవయాని- సాక్షితో పెళ్ళికి రిషి ఒప్పుకుంటాడా? వామ్మో దేవయాని స్కెచ్ మామూలుగా లేదుగా
ఇటు నందు కూడా తులసి, సామ్రాట్ లని తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. తులసి కోసమే సామ్రాట్ కావాలని ఓడిపోయిన విషయం గుర్తు చేసుకుని ఉడికిపోతూ ఉంటాడు. అప్పుడే లక్కీ వచ్చి ఏమైందని అడుగుతాడు. తన మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తాడు. తన చేతిలో బొమ్మ చూపించి ఇది ఎవరు కొనిచ్చారో తెలుసా సామ్రాట్ అంకుల్ ఇది చాలా కాస్ట్లీ అయినా కొనిచ్చారు గ్రేట్ కదా అని లక్కీ అంటాడు. నందు మౌనంగా ఉండటంతో అవును అనొచ్చు కదా మీరు జలస్ గా ఫీల్ అవుతున్నారా అని అంటాడు. ఆ మాటకి నందు కోపంగా పైకి లేచి బొమ్మని విసిరేయబోతాడు. అప్పుడే లాస్య వచ్చి చిన్న పిల్లాడితో ఏంటి అనేసరికి బొమ్మ తీసుకుని లక్కీ వెళ్ళిపోతాడు. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావ్, ఎవరు నీ ముందు సామ్రాట్ ని పొగిడినా తట్టుకోలేకపోతున్నావ్ నీ పద్ధతి మార్చుకో అని లాస్య చెప్తుంది.
Also Read: నేను మోనిత సేమ్ టు సేమ్ అంటోన్న శోభ- సౌందర్య ఇంటికి పెళ్ళిపత్రికలతో వచ్చిన స్వప్న
తరువాయి భాగంలో..
తులసి కోసం సామ్రాట్ ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. లేటుగా వచ్చినందుకు తులసి సారీ చెప్తుంది. నీ కారణంగా మా వర్క్స్ అన్నీ డిస్ట్రబ్ అయ్యాయి. ఇట్స్ వెరీ బ్యాడ్ అని నందు కోపంగా అంటాడు. తులసిగారిని హార్ట్ చేసేలా మాట్లాడే హక్కు మీకు లేదని సామ్రాట్ నందుకి వార్నింగ్ ఇస్తాడు. సారీ సర్ అని లాస్య అంటే అది చెప్పాల్సింది నాకు కాదు తులసికి అని సామ్రాట్ అంటాడు.