Karthika Deepam August 6th Update: నేను మోనిత సేమ్ టు సేమ్ అంటోన్న శోభ- సౌందర్య ఇంటికి పెళ్ళిపత్రికలతో వచ్చిన స్వప్న
ఓ వైపు సౌందర్య హిమ, నిరుపమ్ ల పెళ్లి చెయ్యాలని ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపమని హిమ ప్రేమ్ ని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
శోభ నోటికొచ్చినట్టు వాగుతుంటే సౌందర్య లాగి పెట్టి చెంప చెల్లుమనివిస్తుంది. యనేటి మమ్మీ నా ఇంటికి వచ్చి నా కోడలినే కొడతవా అని స్వప్న అంటుంది. ఎవరే నీ కోడలు నువ్వు కోడలు అనుకుంటే సరిపోతుందా నీ కోడలు ఎవరో తెలుసా అని హిమ పెళ్లి పత్రిక చూపించి ఇది నీ కోడలు ఈ ముహూర్తానికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది మీరు ఫిక్స్ అవ్వండి. ఈ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు. నా కొడుకు పెళ్లి విషయంలో నీ పెత్తనం ఏంటి నాకు వాడి మీద హక్కు లేదా అని స్వప్న అంటుంది. నీ మీద ఉండే హక్కే నాకు వాడి మీద కూడా ఉంటుంది. మీ అందరికే ఇదే చెప్తున్న పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు నా ఇష్ట ప్రకారమే నా మనవడికి మనవరాలికి పెళ్లి జరుగుతుందని సూపర్ లెవల్ లో వార్నింగ్ ఇస్తుంది. ఈ పెళ్లి ఎలా అపాలో నాకు బాగా తెలుసని స్వప్న అంటుంది.
Also Read: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న శౌర్య- శోభ చెంప చెల్లుమనిపించిన సౌందర్య, స్వప్నకి వార్నింగ్
పెళ్లి పనులు మొదలయ్యాయి.. చూస్తుంటే పెళ్లి కూడా జరిగేలా ఉంది నాకు చాలా టెన్షన్ గా ఉంది ఈ పెళ్లి ఎలాగైనా ఏం చేసి అయినా ఆపు అని హిమ ప్రేమ్ ని బతిమలాడుతుంది. ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపుతాను నువ్వు టెన్షన్ పడకు అని ప్రేమ్ హామీ ఇస్తాడు. శౌర్య రవ్వ ఇడ్లీ(ఆనంద్) దగ్గరకి వస్తుంది. ఇటు రావడమే మానేశావ్ ఏంటి నా మీద కోపమా అని అంటాడు. నీకోసం ఎవరో శోభ వచ్చి వెళ్ళింది.. చాలా బాగా మాట్లాడిందని చెప్తాడు. ఏమని అడిగిందని శౌర్య అంటుంది. ఇంకేమీ అడగలేదు నీ గురించి అడిగి వెళ్లిపోయిందని చెప్తాడు. కళ్యాణ మండపంలో పెళ్లి డెకరేషన్స్ చేస్తున్నారంట అని శోభ చెప్తుంది. మనకి ఖర్చు కాకుండా మమ్మీ అన్ని చేస్తుందిగా అని స్వప్న, శోభ నవ్వుకుంటారు. అది చూసి కోపంగా ఆపుతారా అని నిరుపమ్ అరుస్తాడు. శోభ నేను హిమని ప్రేమిస్తున్నాను, ఈ విషయం నేను అందరికీ చెప్పాను నీకు ఎందుకు అర్థం కావడం లేదని అంటాడు. ఒకప్పుడు మీ మావయ్య ఉన్నప్పుడు తనకోక గర్ల్ ఫ్రెండ్ ఉండేది.. ఆవిడ చనిపోయిందో బతికి ఉందో తెలియదు.. కానీ నేను మాత్రం బతికే ఉన్నా కదా నేను నిన్ను ప్రేమించాను.. కార్తీక్ ముందు ఎస్ అని తర్వాత కాదని అన్నాడంట కానీ నువ్వు ముందు ఫ్రెండ్లీగా ఉన్నావ్.. పెళ్లి చేసుకుందాం అంటే దూరంగా అయిపోయావ్.. ఆవిడకి నాకు బాగా దగ్గర పోలికలు ఉన్నాయి. మేన మామ పోలికలు నీకొస్తే మోనిత క్యారెక్టర్ గా నేను వచ్చాను.. నేను అలాగే మొండిదాన్ని పట్టుదలతో ఉంటాను. ఎందుకంటే నాది ప్రేమ కదా.. నువ్వు హిమతో బావా మనం పెళ్లి చేసుకుందాం అని ఒక్క మాట అనిపించు నేను అమెరికా వెళ్లిపోతాను అని పదా వెళ్దాం అని శోభ అంటే నిరుపమ్ అరుస్తాడు.
Also Read: తులసి కోసం ఓడిపోయి తనకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సామ్రాట్- అది చూసి కుళ్ళుకుంటున్న లాస్య, నందు
మమ్మీ నువ్వు అన్నం తినడం లేడని బాధపడుతున్నావని వచ్చాను ఏంటి ఇదంతా అని కోపంగా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శౌర్య బాధగా నిలబడి ఆలోచిస్తూ ఉంటే ఆనందరావు అక్కడికి వస్తాడు. నేను ఈ ఇంట్లో గోడకి వేలాడ దీసిన పెయింటింగ్ లాంటి దాన్ని నేను ఉంటాను కానీ ప్రయోజనమేమి లేదని శౌర్య బాధగా అంటుంది. నువ్వు ఏమడిగినా చేసేవాడినే కానీ నువ్వు కోరుకున్న వాడితో మాత్రం పెళ్లి చేయలేకపోతున్నాను అని ఆనందరావు బాధపడతాడు. నేను ప్రేమించిన వాడితో మీ మనవరాలితో పెళ్లి జరుగుతుంది.. నేను ఈ ఇంట్లో ఉండటం అనవసరం అలాంటప్పుడు నన్ను సంతోషంగా ఎలా ఉండమంటున్నావ్ ఎలా తాతయ్య అని బాధపడుతుంది. తన మాటలకి ఆనందరావు ఎమోషనల్ అవుతాడు. శౌర్య అన్న మాటలు తలుచుకుని ఆనందరావు బాధపడుతూ ఉంటే ఏమైందని సౌందర్య అడుగుతుంది. దాని మనసులో బాధ తీసేయలేకపోతున్నాం అని అంటాడు. హిమకి, నిరుపమ్ కి పెళ్లి జరిగితే అన్ని సర్దుకుంటాయి, కాలమే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని సౌందర్య అంటుంది. ఆ మాటకి థాంక్స్ అమ్మమ్మ అని నిరుపమ్ అంటాడు. హిమకి నేనంటే ఇష్టమని నాకు తెలుసు కానీ బలవంతంగా తనలోని ప్రేమ దాచుకుంటుంది. చాలాకాలం తర్వాత శౌర్య ఇంటికి వచ్చింది. తన మనసు నొప్పించకుండా ఉండటం కోసం తనని పెళ్లి చేసుకోమనాయి బలవంత పెడతారు అనుకున్నాను.. కానీ అలా చెయ్యలేదు మీకు ఏం చేసినా తక్కువే అని కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడే స్వప్న శోభని తీసుకుని ఇంటికి వస్తుంది. ఒక్కడివే ఆశీర్వాదం తీసుకుంటున్నవా జంటగా తీసుకో అని శోభని వెళ్ళమని అంటుంది. మీరిద్దరు కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంది. ఆ మాటకి నిరుపమ్ తిడతాడు.