News
News
X

RRR Movie: RRR ప్రకటించి నేటికి ఐదేళ్లు - సీక్వెల్‌కు సిద్ధమవుతున్నట్లేనా? ఇన్‌స్టా పోస్ట్ వైరల్

ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సీక్వెల్ పై చర్చ నడుస్తోంది. త్వరలో ఈ సినిమా పార్ట్ 2 రాబోతోందని సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి.

FOLLOW US: 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా గురించి ప్రకటించి నేటికి సరిగ్గా ఐదేళ్లు అయింది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25 న విడుదలై దాదాపు 1200 కోట్ల వసూళ్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సీక్వెల్ పై చర్చ నడుస్తోంది. త్వరలో ఈ సినిమా పార్ట్ 2 రాబోతోందని సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ చేసిన ఓ పోస్ట్ తో అది నిజమే అని తెలుస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రకటించి నేటికి ఐదేళ్లు అయిన సందర్భంగా డి.వి.వి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అది, 2017 లో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాను ప్రకటిస్తూ రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు రాజమౌళి. ఇప్పుడీ పోస్ట్ ను టాగ్ చేస్తూ రీ పోస్ట్ చేశారు. దీంతో 'ఆర్ఆర్.ఆర్' సినిమాపై మళ్ళీ చర్చ మొదలైంది. అంతక ముందు దర్శకుడు రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూ లో ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ గురించి సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు. ఈ సినిమా సీక్వెల్ గురించి తన తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ తో చర్చించినట్లు, సీక్వెల్ కోసం ఆయన కథను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారట. ఇప్పటి వరకూ రాజమౌళి సినిమాలు అన్నిటికీ ఆయనే కథలు అందించారు. అందుకే ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ కు ఆయనే కథ రాసే పనిలో ఉన్నారని సమాచారం. అయితే త్రిబుల్ ఆర్ కి సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. 

ఇటీవ‌లే 'ఆర్.ఆర్.ఆర్' ను జ‌పాన్‌ లో రిలీజ్ చేశారు. దీని కోసం ప్రత్యేకంగా కొన్ని రోజులు అక్కడ ఉండి ప్రచారం చేసింది మూవీ టీమ్. అక్కడ కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. సినిమాలో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్ చేసిన న‌ట‌న‌కు విమర్శకుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ ఇద్దరు పోరాట యోధులు క‌లిసి బ్రిటీష‌ర్స్‌ పై చేసిన పోరాట సన్నివేశాలను హై ఇంటెన్స్ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ తో రాజ‌మౌళి తెరపై ఆవిష్క‌రించిన తీరుకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అందుకే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత రాజమౌళి మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొద‌లవుతుంది. మ‌హేష్‌బాబు సినిమా పూర్త‌యిన త‌ర్వాతే ఆర్.ఆర్.ఆర్ 2 సెట్స్‌ పైకి వ‌చ్చే అవకాశం ఉందని సమాచారం. అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా వేరే ప్రాజెక్టులు చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ తో ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నారు తారక్. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ఆర్.సి 15 లో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాలు పూర్తయి ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ గురించి అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

News Reels

View this post on Instagram
 
A post shared by DVV Entertainment (@dvvmovies)

Published at : 18 Nov 2022 01:58 PM (IST) Tags: RRR Ram Charan NTR RRR 2 Raja Mouli

సంబంధిత కథనాలు

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Prabhas Kriti Sanon: ప్రభాస్ ప్రేమలో కృతి సనన్ - గుట్టురట్టు చేసిన వరుణ్ ధావన్, ఆందోళనలో అనుష్క ఫ్యాన్స్!

Prabhas Kriti Sanon: ప్రభాస్ ప్రేమలో కృతి సనన్ - గుట్టురట్టు చేసిన వరుణ్ ధావన్, ఆందోళనలో అనుష్క ఫ్యాన్స్!

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Gautham Karthik-Manjima Mohan Marriage: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా

Gautham Karthik-Manjima Mohan Marriage: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల