RGV On Kanthara: ‘కాంతరా’పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు, అవన్నీ దిగదుడుపేనంటూ ట్వీట్!
భారతీయ సినీ పరిశ్రమలో ‘కాంతారా‘ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి దిగ్గజ సినిమాలను వెనక్కి నెట్టేస్తోంది. ఈ అద్భుత సినిమాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగులోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ‘కాంతారా‘ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఏ సినిమా అభిమాని నోట విన్నా, ప్రస్తుతం ఇదే సినిమా పేరు వినిపిస్తున్నది. కన్నడలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా, తాజాగా తెలుగు, హిందీ భాషల్లోకి అనువాదమై రిలీజ్ అయ్యింది. కన్నడలోనే కాకుండా, తెలుగు, హిందీ పరిశ్రమల్లోనూ ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూసి సినిమా దిగ్గజాలే ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే నటించారు. ఆయన నటన ఈ సినిమాకు కీలకంగా చెప్పుకోవచ్చు.
తెలుగులో సంచలన విజయం
దేశ సినిమా పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న ‘కేజీఎఫ్’ లాంటి సినిమాలను నిర్మించిన హోంబలే సంస్థ ‘కాంతార’ను సైతం ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు చేపట్టింది. కన్నడలో ఆ సినిమాను చూసిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, తెలుగు డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ. 2 కోట్లు కేటాయించారు. తాజాగా ‘కాంతారా’ సినిమాను గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం(అక్టోబర్ 15) నాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ జరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అటు హిందీలో 3.5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. కర్ణాటకలోని కంబ్లా, భూతకోలా సంస్కృతి, సాంప్రదాయం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరక్కించాడు రిషబ్ శెట్టి.
Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!
అవన్నీ దిగదుడుపేనన్న ఆర్జీవీ!
ఈ సినిమా అద్భుతంగా ఉందని పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని రెండు సార్లు చూసినట్లు చెప్పారు. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రొటీన్ వ్యవహారాలకు భిన్నంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిందన్నారు. “సూపర్ స్టార్స్, మాసివ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ వీఎఫ్‌ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్‌లకు రప్పించగలవని ఫిలింవాలాలందరూ ఒక నిర్ణయానికి వచ్చారని, ఈ తరుణంలో ఓ చిన్న సినిమా ‘కాంతారా’ బిగ్గీల రికార్డులన్నింటినీ బద్దలు కొడుతోంది” అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.
Just when all Filmwallas came to the conclusion that only SUPER STARS, MASSIVE PRODUCTION VALUES and SPECTACULAR VFX can bring people to theatres , a small tiny film with no names #Kantara is breaking all the records of the BIGGIES
— Ram Gopal Varma (@RGVzoomin) October 17, 2022