అన్వేషించండి

పెళ్లికూతురుగా కీర్తి సురేష్‌ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా సినిమా ‘దసరా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల అయ్యింది.

హీరో నాని నటిస్తున్న తాదజాగా సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. `శ్యామ్ సింగరాయ్` మూవీతో సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నాని, `అంటే సుందరానికి` చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో `దసరా` మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని గతంలో ఎప్పుడు కనిపించని రీతిలో.. ఊర మాస్ గా దర్శనం ఇవ్వబోతున్నాడు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే మాస్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఆకట్టుకుంటున్న కీర్తి ఫస్ట్ లుక్

ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా అందాల తార  కీర్తి సురేష్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి  కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి వెన్నెల అనే పాత్రలో నటిస్తోంది. ‘హ్యాపీ బర్త్ డే టు అవర్ వెన్నెల’ అంటూ ఈ పోస్టర్ మీద రాశారు. “వెన్నెల అనేది పేరు మాత్రమే కాదు. ఒక ఎమోషన్. మా చిత్తు చిత్తుల బొమ్మ కీర్తి సురేష్ కి జన్మదిన శుభాకాంక్షలు” అని హీరో నాని ట్వీట్ చేశాడు.  పసుపు పచ్చ చీర కట్టుకుని పెళ్లి కూతురుగా డ్యాన్స్ చేస్తున్నట్లు ఈ పోస్టర్ లో  దర్శనం ఇచ్చింది కీర్తి. ఓ మధ్య తరగతి అమ్మాయి మాదిరిగా చేతులకు గాజులతో, నుదిటిన బాసింగం కట్టుకుని, మల్లెపూల జడను ధరించి ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

దుమ్మురేపుతున్న ‘దసరా’ బిజినెస్

నాని న‌టిస్తున్న తొలి పాన్ ఇండియ‌న్ సినిమా ‘దసరా’.  తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా 2023 మార్చి 30 రిలీజ్ చేయ‌బోతున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో  `దసరా` సినిమాకు ఓ రేంజిలో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తున్నది.  ఇప్ప‌టికే ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హక్కులను ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజార్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా  రూ. 30  కోట్లు చెల్లించింది. ఇతర భాషలకు చెందిన రైట్స్ రూ.10 కోట్లకు అమ్ముడయ్యాయట. అటు శాటిలైట్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే  నాన్ థియేట్రికల్  హక్కులకే ఈ సినిమా రూ.60 కోట్లు రాబ‌ట్టింది. ఇక దసరా థియేట్రికల్ రైట్స్ రూ.40 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తున్నది. మొత్తంగా ద‌స‌రా సినిమా  రూ.100 కోట్ల బిజినెస్ చేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతున్నది. ఇది వాస్తవం అయితే నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా ‘దసరా’ నిలుస్తుంది.

Also Read: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!

టాప్ హెడ్ లైన్స్

Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Romantic Drama OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా రొమాంటిక్ మూవీ - తెలుగుతో పాటు 19 భాషల్లో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా రొమాంటిక్ మూవీ - తెలుగుతో పాటు 19 భాషల్లో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget