Ramam Raghavam: దర్శకుడిగా ధనరాజ్ మొదటి సినిమా ఫస్ట్ లుక్ - ఆయన వెనుక ఉన్న నటుడిని గుర్తు పట్టారా?
'రామం రాఘవం'తో నటుడు ధనరాజ్ దర్శకుడిగా మారారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Comedian Dhanraj turns director with Tamil and Telugu bilingual movie Ramam Raghavam: 'బలగం'తో దర్శకుడిగా మారిన వేణు టిల్లు (జబర్దస్త్ వేణు) ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. వేణు స్నేహితుడు, మరొక నటుడు ధనరాజ్ సైతం దర్శకుడిగా మారారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'రామం రాఘవం'తో దర్శకుడిగా ధనరాజ్
ధనరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రానికి 'రామం రాఘవం' టైటిల్ ఖరారు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వీ పొలవరపు ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
'రామం రాఘవం' సినిమాలో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన కుమారుడిగా ధనరాజ్ కనిపించనున్నారు. ఒక వైపు దర్శకత్వం వహించడడంతో పాటు మరోవైపు కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రి కొడుకులుగా వాళ్లిద్దర్నీ చూపించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ (Ramam Raghavam movie first look)ను 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదలైంది. ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ప్రముఖులు... సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు.
Also Read: ఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ చూశారా?
Wishing Kani annae as always the best of the best in his career
— Vishal (@VishalKOfficial) January 22, 2024
With the blessings of Lord Rama, releasing the 1st look & title of Bilingual #SlatePencilStories - #RAMAM_RAGAVAM
U are going to experience the beautiful tale of a father & son@thondankani @DhanrajOffl @Mokksha06… pic.twitter.com/XDaIhNw8Xf
''ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నాం. సముద్రఖని గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా బాగా వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని దర్శకుడు, నటుడు ధనరాజ్ కొరనాని తెలిపారు.
Also Read: నయా నరేంద్ర మోడీ బయోపిక్ - అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా!
'రామం రాఘవం' సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృథ్వీ, శ్రీనివాస రెడ్డి, 'చిత్రం' శ్రీను, ప్రమోదిని, 'రాకెట్' రాఘవ, 'రచ్చ' రవి, ఇంటూరి వాసు తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి 'విమానం' చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ అందించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తుండగా... మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. దుర్గా ప్రసాద్ కెమెరామెన్.