అన్వేషించండి

Emergency Release Date: ఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగన లుక్ చూశారా?

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన సినిమా 'ఎమర్జెన్సీ'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాంతో పాటు విడుదల తేదీ కూడా అనౌన్స్ చేశారు.

Kangana Ranaut first look as Indira Gandhi from Emergency, movie release date: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎమర్జెన్సీ'. కేవలం నటించడం మాత్రమే కాదు... దర్శకత్వం వహించారు, మణికర్ణిక ఫిలిమ్స్ పతాకంపై ప్రొడ్యూస్ కూడా చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్
'ఎమర్జెన్సీ' సినిమాలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. షార్ట్ హెయిర్ కట్, మెడలో రుద్రాక్ష మాల, శారీ... ఇందిరగా కంగనాను చూస్తే పర్ఫెక్ట్ మ్యాచ్ అనేలా ఉన్నారు. అయితే... ఈ లుక్ అంత ఈజీగా రాలేదు. దీనికి కోసం ముందు నుంచి వర్క్ చేశారు. ప్రోస్థటిక్ మేకప్ ఉపయోగించారు. 

ఇండియాలో చీకటి ఘడియల వెనుక కథ
జూన్ 14, 2024న 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ రోజు కంగనా రనౌత్ వెల్లడించారు. ''ఇండియాలో చీకటి ఘడియల వెనుక ఉన్న కథను తెలుసుకోండి. చరిత్రలోనే అత్యంత భయపడిన, భయంకరమైన ప్రధాన మంత్రిని సినిమా హాళ్లల్లో చూడండి'' అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.

భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి కోణంగా కొందరు చెబుతుంటారు. వాళ్లపై ఎదురు దాడి చేసే వారు కూడా ఉన్నారు. అయితే... బీజేపీ మనిషిగా ముద్ర పడిన కంగనా రనౌత్ నుంచి 'ఎమర్జెన్సీ' వస్తుండటంతో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ సినిమా వ్యతిరేకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

'ఎమర్జెన్సీ' సినిమాలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తోంది.

Also Readనయా నరేంద్ర మోడీ బయోపిక్‌ - అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా!  

అప్పుడు జయలలిత... ఇప్పుడు ఇందిరా గాంధీ!
భారత రాజకీయాలలో ఉక్కు మహిళలుగా పేరు గాంచిన ఇద్దరి జీవిత కథలతో తెరకెక్కిన సినిమాల్లో నటించిన అరుదైన ఘనత కంగనా రనౌత్ సొంతం అని చెప్పాలి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో ఆమె టైటిల్ రోల్ చేశారు. అయితే... ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ 'ఎమర్జెన్సీ'లో ఆవిడ ఇందిరా గాంధీ పాత్ర చేశారు. మరి, ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.

Also Read: నాలుగు వందల కోట్లు... ఐదు సినిమాలు... బెంగళూరులో ఈ రోజు ఓపెనింగ్!

నిజం చెప్పాలంటే... ఇటీవల కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ దగ్గర విజయాలు సాధించలేదు. భారీ డిజాస్టర్లు అయినవి కూడా కొన్ని ఉన్నాయి. మరి, 'ఎమర్జెన్సీ' ఆ ఫ్లాపుల పరంపరకు బ్రేకులు వేసి భారీ హిట్ కంగనాకు అందించాలని ఆశిద్దాం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Youtube Income: యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Sukumar: 'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకూ... సుకుమార్ హీరోలలో ఈ లోపాలు గమనించారా?
'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకూ... సుకుమార్ హీరోలలో ఈ లోపాలు గమనించారా?
Embed widget