అన్వేషించండి

RC Studios: నాలుగు వందల కోట్లు... ఐదు సినిమాలు... బెంగళూరులో ఈ రోజు ఓపెనింగ్!

దర్శకుడు ఆర్ చంద్రుకు చెందిన ఆర్.సి. స్టూడియోస్ సంస్థ భారీ సినిమాలకు శ్రీకారం చుట్టింది. 400 కోట్లకు పైగా పెట్టుబడితో ఐదు సినిమాలను ఒకే రోజు ప్రారంభించనుంది.

ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమ పేరు దేశవ్యాప్తంగా వినబడుతోంది. యశ్ 'కెజియఫ్' రెండు భాగాలు, రిషబ్ శెట్టి 'కాంతార', ప్రభాస్ 'సలార్' సినిమాలతో హోంబలే ఫిల్మ్స్... సుదీప్ 'విక్రాంత్ రోణ', రక్షిత్ శెట్టి '777 చార్లీ', 'సప్త సాగరాలు దాటి' రెండు భాగాలతో కెవిఎన్ ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలు కన్నడ సినిమా గౌరవాన్ని పెంచాయి. అటువంటి పాన్ ఇండియా భారీ సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తోంది ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రుకు చెందిన RC స్టూడియోస్. ఒకే రోజు ఐదు సినిమాలు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

'కబ్జ'తో మొదలైన ఆర్.సి. స్టూడియోస్
తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ సినిమా 'కబ్జ'. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఆర్ చంద్ర దర్శకత్వం వహించిన ఆ సినిమాతో ఆర్.సి. స్టూడియోస్ ప్రారంభమైంది. 'కెజియఫ్' తరహాలో భారీగా తీసిన 'కబ్జ'కు కన్నడలో మంచి ఆదరణ లభించింది. దాంతో పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు చంద్రు.  

బెంగళూరులో ఈ రోజే ఐదు సినిమాల ఓపెనింగ్
బెంగళూరులో ఈ రోజు (జనవరి 23వ తేదీ) సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రి, అగ్ర హీరోలు... అతిరథ మహారథుల సమక్షంలో ఆర్‌.సి. స్టూడియోస్ ఒకేసారి 5 సినిమాలను ప్రారంభిస్తోంది. బహుశా... భారతీయ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఒకే నిర్మాణ సంస్థలో ఒకే రోజు ఐదు సినిమాలను ప్రారంభించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. రూ. 400 కోట్లకు పైగా పెట్టుబడితో ఐదు సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: నయా నరేంద్ర మోడీ బయోపిక్‌ - అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా!

''గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మిస్టర్ ఆనంద్ పండిట్ గారికి చెందిన ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, ముంబైకి చెందిన లోటస్ డెవలపర్స్ చేతుల మీదుగా ఐదు సినిమాలు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ రియల్ స్టార్ శ్రీ ఉపేంద్ర కూడా ఈ శుభ వేడుకకు హాజరు కానున్నారు'' అని ఆర్.సి. స్టూడియోస్ సంస్థ తెలియజేసింది. 

సింగపూర్‌లోని ఇన్వెనియో ఆరిజిన్ కంపెనీకి చెందిన మిస్టర్ అలంకార్ పాండియన్, వ్యాపారవేత్త శ్రీ సీకల్ రామచంద్ర గౌడతో కలిసి ఆర్.సి. స్టూడియోస్ ఈ ఐదు సినిమాలు నిర్మించనుంది.

Also Readహృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?

తెలుగులోనూ సినిమా తీసిన చంద్రు
దర్శకుడు ఆర్ చంద్రు తెలుగులో ఓ సినిమాకు దర్శకత్వం వహించారు. కన్నడలో తాను తీసిన సూపర్ హిట్ సినిమా 'చార్మినార్'ను తెలుగులో సుధీర్ బాబు, నందితా రాజ్ హీరో హీరోయిన్లుగా 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' పేరుతో రీమేక్ చేశారు. కన్నడలో చంద్రు దర్శకుడిగా పరిచయమైన 'తాజ్ మహల్' సూపర్ హిట్. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులో శివాజీ రీమేక్ చేశారు. 'కబ్జ'కు ముందు ఉపేంద్ర హీరోగా తీసిన 'బ్రహ్మ' ఆయనకు భారీ విజయం అందించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget