Fighter Movie: హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఫేక్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
Fighter movie first fake review: హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన హిందీ సినిమా 'ఫైటర్'. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న విడుదల అవుతోంది. దీనికి ఫేక్ రివ్యూస్ స్టార్ట్ అయ్యాయి.
Hrithik Roshan and Deepika Padukone's Fighter first fake review out: హృతిక్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ సినిమా 'ఫైటర్'. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. ఇద్దరూ ఫైటర్ జెట్ పైలట్ రోల్స్ చేశారు. వీళ్లతో పాటు సీనియర్ హీరో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ గురువారం (జనవరి 25న) థియేటర్లలో విడుదల అవుతోంది. అయితే, ఈ సినిమాకు ఆల్రెడీ ఫేక్ రివ్యూస్ స్టార్ట్ అయ్యాయి.
'హనుమాన్' బాలేదన్నాడు...
కట్ చేస్తే, 'ఫైటర్' మీద పడ్డాడు!
Fighter movie review 2024: ప్రతి సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఫేక్ రివ్యూస్ పోస్ట్ చూస్తూ పాపులర్ అయిన వ్యక్తి ఉమైర్ సందు. తనను దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకోవడం అతనికి అలవాటు. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హనుమాన్' బిలో ఏవరేజ్ అని విడుదలకు ముందు ట్వీట్ చేశాడు ఉమైర్ సందు. కట్ చేస్తే... ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇప్పుడు 'ఫైటర్' మీద పడ్డాడు ఉమైర్ సందు. సినిమా బాలేదని శనివారం ట్వీట్ చేశాడు. ''ఫస్ట్ రివ్యూ ఆఫ్ ఫైటర్: మెరిసేది అంతా బంగారం కాదు. కొత్త సీసాలో పోసిన పాత సారాలా ఉంది. హృతిక్ రోషన్ హీరో పాత్రకు మిస్ కాస్ట్ అనిపించాడు. స్టంట్స్ బావున్నాయి. కానీ, విలన్ బాలేదు'' అని ఉమైర్ సందు పేర్కొన్నాడు. హృతిక్, దీపికా ఫ్యాన్స్ అతని రివ్యూ ఫేక్ అని మండిపడుతున్నారు.
Also Read: సితార గొప్ప మనసు - అనాథల కోసం 'గుంటూరు కారం' స్పెషల్ షో
First Review #Fighter :
— Umair Sandhu (@UmairSandu) January 20, 2024
All that Glitters is not Gold !! Old wine in a New bottle! #HrithikRoshan𓃵 totally miscast! Stunts are Terrific but Villain is full on Chutiya !
⭐️⭐️
రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత...
సిద్ధార్థ్ ఆనంద్ హ్యాట్రిక్ కొడతాడా?
'ఫైటర్' సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దీనికి ముందు ఆయన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్'కు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు ముందు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' తీశారు. రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత మరోసారి సిద్ధార్థ్ ఆనంద్ భారీ సక్సెస్ అందుకుంటారా? ఆయన హ్యాట్రిక్ కొడతారా? అని బాలీవుడ్ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: రామ మందిరం ప్రారంభోత్సవం ... ఆహ్వానం అందింది కానీ వెళ్లలేకపోతున్నా - మోహన్ బాబు
హృతిక్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తీసిన మూడో చిత్రమిది. 'వార్'కు ముందు 'బ్యాంగ్ బ్యాంగ్' తీశారు. 'ఫైటర్' తర్వాత హృతిక్ రోషన్ 'వార్ 2' చేయనున్నారు. అందులో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించనున్నారు. అయితే, ఆ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించలేదు. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు.