అన్వేషించండి

Sitara Ghattamaneni: సితార గొప్ప మనసు - అనాథల కోసం 'గుంటూరు కారం' స్పెషల్ షో

Guntur Karam Special Screening: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార తనది గొప్ప మనసు అని మరోసారి నిరూపించుకున్నారు. అనాథల కోసం స్పెషల్ షో వేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హీరో. తెలుగు చిత్రసీమలోని అగ్ర హీరోల్లో ఆయన ఒకరు. మహేష్ తాను గొప్ప హీరో మాత్రమే కాదు... తనది గొప్ప మనసు అని పలు సందర్భాల్లో చాటి చెప్పారు. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయిస్తున్నారు. మహేష్ కుమార్తె సితారది సైతం తనది గొప్ప మనసు. ఇప్పటికే తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు. ప్రశంసలు అందుకున్నారు. మరోసారి సితార చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

అనాథల కోసం 'గుంటూరు కారం' స్పెషల్ షో
మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'గుంటూరు కారం'. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఆల్రెడీ 212 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. లేటెస్టుగా ఈ సినిమాను కొంత మంది అనాథలకు సితార చూపించారు.

చీర్స్ ఫౌండేషన్ సంస్థకు చెందిన అనాథ బాలలకు గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో 'గుంటూరు కారం' స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు సితార. అనంతరం ఆ బాలలతో కాసేపు ముచ్చటించారు. వారితో ఫోటోలు దిగారు. సినిమా తమకు నచ్చిందని ఆ చిన్నారులు చెప్పినట్లు తెలిసింది.

Also Read: నంబర్ వన్ బుల్ షిట్ గై... 'బాబు'తో బజ్జీ పాప

కోటి రూపాయలు ఛారిటీకి ఇచ్చిన సితార
సూపర్ స్టార్ ఫ్యామిలీలో జన్మించినప్పటికీ... సితారలో అసలు ఎటువంటి గర్వం ఉండదని ఆమెను సన్నిహితంగా చూసిన జనాలు చెబుతారు. ఆ మధ్య ఓ ప్రోగ్రాంకు సితార వెళ్లారు. ముసలావిడ మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే ఆమెను సాయం అందించారు సితార. పీఎంజే జ్యువెలరీ సంస్థ ప్రచారకర్తగా సితార యాడ్ చేశారు. దాని ద్వారా వచ్చిన కోటి రూపాయలను ఛారిటీకి ఇచ్చేశారు. ఆమె మంచి మనసు గురించి చెప్పడానికి ఇవి ఉదాహరణలు.

Also Read: రామ మందిరం ప్రారంభోత్సవం ... ఆహ్వానం అందింది కానీ వెళ్లలేకపోతున్నా - మోహన్ బాబు

త్వరలో 'గుంటూరు కారం' సక్సెస్ మీట్!?
'గుంటూరు కారం' విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అది తప్ప హీరోతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ మీడియా ముందుకు వచ్చింది లేదు. ఆ తర్వాత మహేష్ బాబు, శ్రీ లీలతో ఒక ఇంటర్వ్యూ విడుదల చేశారు. పబ్లిసిటీ విషయంలో సినిమా యూనిట్ లో ప్రొఫైల్ మైంటైన్ చేసింది. అయినప్పటికీ... సినిమా కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 

సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు ఇంట్లో 'గుంటూరు కారం' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. నైజాంలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ సహా దర్శకులు మెహర్ రమేష్ వంటి సన్నిహితులు ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. లేటెస్ట్ టాక్ ఏమిటంటే... త్వరలో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారట. త్రివిక్రమ్, తమన్ సహా ఆ వేడుకకు అందరూ అటెండ్ అవుతారని టాక్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget