By: ABP Desam | Updated at : 23 Dec 2021 05:58 PM (IST)
దీప్తి సునైన (Image Credit: Instagram/Deepthi Sunaina)
యూట్యూబర్ దీప్తి సునైన తాను చెప్పాలనుకున్నది చెబుతోంది! కానీ, ఎవరిని ఉద్దేశించి చెబుతోందో చెప్పడం లేదు. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెడుతున్న స్టోరీలు చూస్తుంటే ఎవరిని ఉద్దేశించి చెబుతోందో అందరికీ అర్థం అవుతోంది. 'బిగ్ బాస్ 5'కి వెళ్లడానికి ముందు వరకూ షణ్ముఖ్ జస్వంత్‌తో ఆమె ప్రేమలో ఉంది. అతడు 'బిగ్ బాస్'కు వెళ్లిన తర్వాత కూడా ఆమె తన ప్రేమను చాటుకుంది. షోలో ఉన్నప్పుడు షన్ను బర్త్ డే జరిగితే... బయట హడావిడి చేసింది. ఐ లవ్యూ చెప్పింది. కానీ, 'బిగ్ బాస్' హౌస్‌లో సిరి హనుమంతుకు షన్ను దగ్గర కావడంతో ఆమె హర్ట్ అయినట్టు ఉంది.
"నువ్వు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు 'మాట్లాడు' అంటే... " ఈ ప్రశ్న ఎదురు అయితే ఎలా ఉందన్నట్టు ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. 'ఇంకేం మాట్లాడాలిరా?' అన్నట్టు ఆమె ఎక్స్‌ప్రెషన్ ఉందని కొందరు భావిస్తున్నారు. అంతకు ముందు ఓ హాలీవుడ్ సినిమా క్లిప్‌ను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. అందులో "నువ్వు నాతో ఆడుకుంటున్నావ్ కదా" అని హీరోని హీరోయిన్ ప్రశ్నిస్తుంది. అందుకు బదులుగా అతడు 'అవును' అన్నట్టు సమాధానం ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ "ఈజీ టార్గెట్" అని అంటుంది. దీనిని చూస్తే... తాను ఈజీ టార్గెట్ అయినట్టు దీప్తి సునైన భావిస్తుందా? అనే సందేహం కలుగుతోంది.
'కనీసం నీకు నువ్వు అయినా సమాధానం చెప్పుకొనేలా ఉండు', 'నా చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా', 'ఈ ఏడాది నాకు బాగా అనిపించలేదు. కానీ, చాలా నేర్చుకున్నాను' అంటూ వరుసగా దీప్తి సునైన పోస్టులు పెట్టింది. ఇవి చూసి చాలా మంది షన్నుతో ఆమె బ్రేకప్ అయ్యిందని అనుకుంటున్నారు. ఆ డౌట్ క్లియర్ కాకముందే మరోసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో మరికొన్ని పోస్టులు చేశారు. దీప్తి సునైన తీరు చూస్తుంటే... ఆమె ఏదో చెప్పాలని అనుకుంటున్నదని ఆడియన్స్ అందరికీ అర్థం అవుతోంది.
Koo App- Anand Sai (@Madasu1) 23 Dec 2021
Also Read: నానికి టికెట్ రేట్స్, కలెక్షన్స్ గురించి ఐడియా ఉందా? - ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిర్మాత నట్టి
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్టర్ సంగతేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అనసూయ!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం