By: ABP Desam | Updated at : 22 Dec 2022 03:48 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Alitho Saradaga/Etv
టాలీవుడ్ కమెడియన్, నటుడు అలీ గురించి తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిసే ఉంటుంది. విలక్షణమైన నటన, కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అలీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బుల్లితెరపై పలు రకాల ప్రోగ్రామ్ లు చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఆయన హోస్ట్ గా చేసిన ‘అలీతో సరదాగా’ కార్యక్రమం ప్రేక్షకుల ఆదరణ పొందింది. సినీ ఇండస్ట్రీ నుంచి వివిధ రకాల సెలబ్రెటీలను తీసుకొచ్చి వారి అంతరంగాలను ఆవిష్కరించే కార్యక్రమం చేశారు అలీ. అయితే అందర్నీ ఇంటర్వ్యూ చేసే అలీని ఈసారి యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అలీ ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాం జర్నీతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా చెప్పారు. ఈ సందర్భంగా తన పెద్ద అక్క గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు అలీ. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో తన పెద్ద అక్క ఫాతిమా గురించి ఎవరికీ తెలియని విషయాలను చెప్పారు అలీ. తనపై అక్క చాలా ఎక్కువ ప్రేమ చూపించేదని చెప్పారు. చిన్న వయసులో తనను ఉదయాన్నే నిద్రలేపి రెడీ చేసి షూటింగ్ సమయానికి పంపేదని అన్నారు. అందరి కంటే ఎక్కువగా తనపై తన పెద్ద అక్కే ప్రేమను చూపించేదని అన్నారు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఓ ఊహించని ప్రమాదంలో తన అక్క చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ సంఘటన గురించి చెప్తూ.. అప్పటికే పెద్ద అక్కకు ఓ బాబు పుట్టాడని, రెండోసారి గర్భవతిగా ఉన్నా ఇంటి పనులు చేస్తూనే ఉండేదని చెప్పారు. ఎప్పటిలానే ఓ రోజు పిల్లాడి కోసం పాలు వేడి చేయడానికి వంటింట్లోకి వెళ్లింది. గిన్నె పట్టుకోడానికి గుడ్డ లేదని చున్నీతో పట్టుకుంది. మంట అంటుకున్న చున్నీని వెనక్కి వేసుకుంది. దీంతో ఆమెకు కూడా మంటలు అంటున్నాయి. మంటలతో బయటకు వచ్చని అక్కపై నీళ్లు పోశారు. దానివల్ల కడుపులో ఉన్న బిడ్డతో సహా అక్క చనిపోయిందంటూ అలీ భావోద్వేగానికి గురయ్యారు. ఆ ఘటన తనను మానసికంగా ఎంతో కలచివేసిందన్నారు. తన పెద్ద అక్కపై ఉన్న ప్రేమతోనే తన కూతురుకి ఫాతిమా అని పేరు పెట్టుకున్నానని అన్నారు అలీ.
ఇక ‘అలీతో సరదాగా’ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని మొదట మంచు లక్ష్మీతో ప్రారంభించామని అన్నారు. ఆమెకు మొదట థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఆమెతో మొదలైన ఈ టాక్ షో నిర్విరామంగా 300 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుందని చెప్పారు. ప్రస్తుతానికి ఈ షో కు తాత్కాలిక విరామం తీసుకుంటున్నామని త్వరలో మంచి షోతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు.
Read Also: వామ్మో, ప్రాణాలు పోతే? హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ డేరింగ్, సినిమా చరిత్రలోనే అత్యంత ప్రమాదకర స్టంట్!
కాగా ఇటీవల అలీ కూతురు ఫాతిమా వివాహ వేడుకను చాలా గ్రాండ్ గా జరిపించారు అలీ దంపతులు. ఈ వివాహానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలను ప్రత్యేకంగా చిత్రీకరించి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు అలీ భార్య జుబేదా అలీ. ఇక అలీ అటు సినిమాల్లో కూడా నటిస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా యాక్టీవ్ గా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో యాక్టీవ్ గా తిరిగిన సంగతి తెలిసిందే. తర్వాత కూడా పలు మార్లు ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు కూడా. అయితే ఇటీవలె అలీ ఏపీ ఎలక్టానిక్ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు. అలీ కుమార్తె ఫాతిమా పెళ్లికి కూడా సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే
BRS Nanded Meeting : నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !
Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?
Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!
IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!