By: ABP Desam | Updated at : 20 Dec 2022 01:26 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Tom Cruise/twitter
‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నాయి. ఈ సినిమాల్లో టామ్ క్రూజ్ చేసే సాహస విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఉత్కంఠ బరితమైన సీన్లు ప్రేక్షకులకు ఓ రేంజిలో ఆకట్టుకుంటాయి. ‘మిషన్ ఇంపాజిబుల్’ ఏడో సిరీస్ జులై 14, 2023న థియేటర్‌లలో విడుదల కాబోతోంది. ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్- పార్ట్ వన్’ పేరుతో అలరించబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా, ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది.
60 ఏండ్ల వయసున్న టామ్ క్రూజ్.. ఈ సినిమాలో చేసిన స్టంట్స్ చూస్తే అబ్బురపడాల్సిందే. కుర్ర హీరోలకు సైతం సాధ్యంకాని రీతిలో ఆయన సాహసాలు ఉంటాయి. ప్రాణాలకు తెగించిన ఆయన చేసే సీన్లు చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు అందరినీ ఊపిరి బిగపట్టుకునేలా చేస్తాయి. ఈ సినిమాలో ట్రైలర్ చివరిలో బైకుతో సహా ఎత్తైన కొండపై నుంచి లోయలోకి దూకే సీన్ చూస్తే ప్రాణాలు పోయిన ఫీలింగ్ కలుగుతోంది. తాజాగా ఈ సీన్ షూటింగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ప్రపంచ సినీ చరిత్రలోనే అతిపెద్ద సాహసోపేతమైన సీన్ గా గుర్తింపు పొందింది.
So excited to share what we’ve been working on. #MissionImpossible pic.twitter.com/rIyiLzQdMG
— Tom Cruise (@TomCruise) December 19, 2022
నార్వేలో ఈ సీన్ ను షూట్ చేశారు. ఒక కొండపై నుంచి లోయలో దూకే ఈ సన్నివేశాన్ని షూట్ చేయడాని చిత్ర బృందం ఎంత కష్టపడిందో తాజాగా విడుదల చేసిన మేకింగ్ విజువల్స్ లో కనిపించింది. ‘మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ వన్’ లో పెట్టిన ఈ సీన్ ప్రపం యాక్షన్ సినిమాల్లో అత్యంత ప్రమాదకరమైన, సాహసోపేతమైన స్టంట్ గా నిలిచింది. పారామౌంట్ పిక్చర్స్, క్రూజ్ రూపొందించిన సినిమాల్లో ఇదే మోస్ట్ డేంజరస్ సీన్ గా చిత్ర బృందం తెలిపింది. నార్వే హెలెసిల్ట్ లోని ఓ కొండపైన అరిష్ట ఓవర్‌హెడ్ షాట్ రోలింగ్ తో మేకింగ్ వీడియో మొదలవుతోంది. కొండపై నిర్మించిన పొడవైన ర్యాంప్ మీది నుంచి క్రూజ్ బైక్ తో వెళ్తూ లోయలోకి దూకుతాడు. ఈ సీన్ తన కెరీర్ లోనే అత్యంత ప్రమాదకరమైనది అభివర్ణించాడు టామ్ క్రూజ్. ఒకటి కాదు రెండు కాదు.. ఈ సీన్ బాగా రావాలని టామ్ ఆరుసార్లు ఆ ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆయన సాహసానికి సినిమా బృందం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.
టామ్ కు సాహసాలు చేయడం ఇదేమీ కొత్తకాదు. గతంలోనూ అత్యంత కిష్ణమైన స్టంట్స్ చేశారు. ‘టాప్ గన్: మావెరిక్’ సినిమాలో యుద్ధ విమానాలు నడిపి ఆశ్చర్యపరిచారు. F/A-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ ను అమెరికా నేవీ నుంచి అద్దెకు తీసుకుని మరీ ఈ సినిమా కోసం ఉపయోగించారు. ఈ జెట్ విమానాలు నింగిలోకి రాకెట్ లా దూసుకుపోతాయి. శత్రువుల ఊహక అందకుండా దాడి చేస్తాయి. బాంబులు, మిసైల్స్ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకునే సత్తా ఉంటుంది. సాధారణ విమానాలతో పోల్చితే వీడిని నడపడం అంత సులువు కాదు. కానీ, క్రూజ్ వీటిని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ట్రైనింగ్ పొందిన కొద్ది రోజుల్లోనే జెట్ విమానాన్ని నడిపి ఆశ్చర్యపరిచారు.
ఇక హాలీవుడ్ లో ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ ఉంది. 1996లో ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ సీరిస్ షురూ అయ్యింది. ఇప్పటి వరకు 6 సిరీస్ లు విడుదల అయ్యాయి. ఇప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్’ పేరుతో ఏడో సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సైమన్ పెగ్, రెబెక్కా ఫెర్గూసన్, వింగ్ రేమ్స్, వెనెస్సా కిర్బీ, హేలీ అట్ వెల్, పోమ్ క్లెమెంటీఫ్, క్యారీ ఎల్వెస్, ఇందిరా వర్మ, షియా విఘమ్, రాబ్ డి మోరల్స్ సహా పలువురు నటించారు.
Read Also: వెబ్ సీరిస్‌ల్లో నటించేందుకు ఈ స్టార్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే చుక్కలు కనిపిస్తాయ్!
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష
Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్
Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్
Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి