Highest Paid Actors OTT: వెబ్ సీరిస్‌ల్లో నటించేందుకు ఈ స్టార్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే చుక్కలు కనిపిస్తాయ్!
దేశంలో రోజు రోజుకు ఓటీటీలు తమ సత్తా చాటుకుంటున్నాయి. అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆదరణ పొందుతున్నాయి. ఓటీటీలో నటనకు గాను పలువురు స్టార్స్ కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
రోజు రోజుకు ఓటీటీల పరిధి మరింత విస్తరిస్తోంది. డిజిటల్ విప్లవం నేపథ్యంలో ఓటీటీ వినియోగం భారీగా పెరిగింది. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో పాల్గొనే నటీనటులు సైతం రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటున్నారు. దేశంలో ఓటీటీ మూవీస్, వెబ్ సీరిస్‌లలో నటించేందుకు అత్యధిక పారితోషికం తీసుకునే నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
1. జితేంద్ర కుమార్
కోట ఫ్యాక్టరీ లాంటి అద్భుత షోతో ఓటీటీలో తనకంటూ ఓ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు నటుడు జితేంద్ర కుమార్. నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ తో కలిసి ‘పంచాయితీ సీజన్ 2’లో నటించారు. అటు ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ స్పోర్ట్స్ డ్రామా ‘జాదుగర్’లో కూడా కనిపించారు. ఎనిమిది ఎపిసోడ్‌లకు రూ.4 లక్షలు వసూలు చేశాడు.
2. అజయ్ దేవగన్
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, డిస్నీ+ హాట్‌స్టార్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నటించేందుకు దేవగన్ రూ.125 కోట్లు అందుకున్నట్లు సమాచారం. బ్రిటీష్ షో ‘లూథర్’ నుంచి ఈ వెబ్ సీరిస్‌ను రీమేక్ చేశారు.
3. బాబీ డియోల్
ప్రకాష్ ఝా తెరెక్కించిన క్రైమ్ డ్రామా – ‘ఆశ్రమం’తో మంచి గుర్తింపు పొందారు. ‘ఆశ్రమం’ మూడవ సీజన్‌లో నటించినందుకు గాను డియోల్ రూ. 1 నుంచి 4 కోట్లు తీసుకున్నారు.
4. రాధికా ఆప్టే
‘మోనికా’, ‘ఓ మై డార్లింగ్’, ‘విక్రమ్ వేద’, ‘ఫోరెన్సిక్’ సినిమాతో ఆకట్టుకున్న రాధిక ఆప్టే ఓటీటీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీనటులలో ఒకరు. నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో RAW ఏజెంట్ గా నటించినందుక రూ. 4 కోట్లు తీసుకుంది.
5. పంకజ్ త్రిపాఠి
నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రేడ్ గేమ్స్’లో గురూజీ పాత్రను పోషించిన పంకజ్ త్రిపాఠి, అమెజాన్ ప్రైమ్ వీడియో ‘మీర్జాపూర్’లో అఖండానంద త్రిపాఠి అకా కలీన్ భయ్యా పాత్ర పోషించినందుకు రూ. 12 కోట్లు తీసుకున్నారు.
6. మనోజ్ వాజ్‌పేయి
మనోజ్ వాజ్‌పేయి నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఫ్యామిలీ మ్యాన్’లో శ్రీకాంత్ తివారీగా ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ రెండో సీజన్ కోసం ఆయన ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నారు.
7. సైఫ్ అలీ ఖాన్
నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తొలి సీజన్ ఎనిమిది ఎపిసోడ్‌ల సైఫ్ అలీ ఖాన్ రూ.15 కోట్లు వసూలు చేశాడు.
8. సమంతా
గత సంవత్సరం ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ ఆకట్టుకున్నది సమంత. ఇందులో తన పాత్ర కోసం రూ. 4 కోట్లు తీసుకుంది.
9. నవాజుద్దీన్ సిద్ధిఖీ
‘సేక్రేడ్ గేమ్స్’ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. రెండో సీజన్ లో నటనకు గాను రూ. 10 కోట్లు వసూలు చేశాడు.
10. అలీ ఫజల్
అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘మీర్జాపూర్’ మూడవ సీజన్‌లో కనిపించనున్నారు అలీ ఫజల్. ఇందుకోసం తను ఒక్కో ఎపిసోడ్ కు రూ. 12 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Also: ఆ విషయంలో జాన్వీ, సారాలను వెనక్కి నెట్టేసిన ఉర్ఫీ - ఆసియాలోనే టాప్ ప్లేస్‌లో!