News
News
X

Urfi Javed: ఆ విషయంలో జాన్వీ, సారాలను వెనక్కి నెట్టేసిన ఉర్ఫీ - ఆసియాలోనే టాప్ ప్లేస్‌లో!

సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్, మరో అరుదైన ఘనత సంపాదించింది. గ్లోబల్‌ గా మోస్ట్ సెర్చ్ ఏషియన్ సెలెబ్రిటీగా అవతరించింది.

FOLLOW US: 
Share:

2022లో ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియా సెలెబ్రిటీగా ఉర్ఫీ జావేద్ అవతరించింది. సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, దిశా పటానీ లాంటి నటీమణులను  సైతం వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది.  ఉర్ఫీ రెండుసార్లు ఆసియాలో టాప్ సెర్చ్‌డ్ పర్సనాలిటీ లిస్టులో ప్లేస్ సంపాదించుకుంది. తాజాగా గూగుల్ '2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్' జాబితా విడుదల చేసింది. ఎంతో మంది టాప్ సెలబ్రిటీలను కాదని ఉర్ఫీ ఈ లిస్టులో టాప్ ప్లేస్ దక్కించుకుంది.

రెండుసారి సత్తా చాటిన ఉర్ఫీ జావేద్

ఉర్ఫీ జావేద్ ఈ లిస్టులో టాప్ ప్లేస్ దక్కించుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమె ఈ అరుదైన ఘనతను అందుకుంది. తాజాగా మరోసారి ఈ లిస్టులో స్థానం పొందింది. ఉర్ఫీ జావేద్ అంటేనే  వెరైటీ ఫ్యాషన్ కు ఐకాన్ గా మారిపోంది. తన వింత వింత డ్రెస్సులతో నెటిజన్లను అలరిస్తోంది. అవే డ్రెస్సులు ఆమెను ట్రోలింగ్ కు గురి చేశాయి కూడా. తన డ్రెస్ విషయంలో ఎన్ని వివాదాలు వచ్చిన, డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించింది ఉర్ఫీ. వివాదాలు, అందాల ప్రదర్శనతో మొత్తంగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఆమె గురించి తెలుసుకునేలా చేసింది.

సెలబ్రిటీలలో నెంబర్ వన్

వాస్తవానికి మోస్ట్ సెర్చ్‌డ్క ఏషియన్ లిస్టులో ఉర్ఫీ 57వ స్థానాన్ని పొందింది. అయితే, సినిమా పరిశ్రమ నుంచి ఎంపికైన సెలబ్రిటీల్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. టీవీ యాక్టర్ అయినప్పటికీ తన అదిరేటి డ్రెస్సులతో హీరోయిన్లను సైతం బీట్ చేసింది. తన డ్రెస్సింగ్ గురించి ఎవరెన్ని కామెంట్స్ చేసిన  పెద్దగా పట్టించుకోనని ఆమె వెల్లడించింది. నెటిజన్ల ట్రోలింగ్ కారణంగానే తను ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ గా తయారైనట్లు వివరించింది.

బుల్లితెరపై సందడే సందడి!

ఇక ఉర్ఫీ జావేద్ తాజాగా ’స్ప్లిట్స్‌ విల్లా 14’లో కనిపించింది. అటు ‘హాయె హాయె యే మజ్‌బూరీ’ అనే ఆల్బమ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మేరీ దుర్గా’, ‘బేపన్నా’, ‘పంచ్‌ బీట్‌ సీజన్‌ 2’, ‘చంద్ర నందిని’, ‘సాత్‌ ఫేరో కీ హేరా ఫేరీ’, ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ లాంటి టీవీ షోలతో ఆకట్టుకుంది. గతేడాది బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని ఆకట్టుకుంది.

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

Read Also: ఓ మై గాడ్, విమానం నుంచి అలా దూకేశావేంటి మెహ్రీన్ - హనీ ఈజ్ బ్రేవ్

Published at : 19 Dec 2022 03:59 PM (IST) Tags: Janhvi Kapoor Sara Ali Khan Urfi Javed Most Searched Asian Celeb

సంబంధిత కథనాలు

Casting Couch : నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే : రవి కిషన్

Casting Couch : నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే : రవి కిషన్

Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!