By: ABP Desam | Updated at : 19 Dec 2022 11:26 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@MEHREEN/Instagram
మెహ్రీన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సాహసాలు చేస్తూ అలరిస్తోంది. తాజాగా అబుదబిలో చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి వారెవ్వా అనిపించింది. స్కై డైవ్ కు వెళ్లడానికి ముందు చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నట్లు చెప్పింది. హార్ట్ బీట్ పెరిగినట్లు వివరించింది. స్కై డైవ్ కు తీసుకెళ్లే సిబ్బందితో కలిసి తేలికపాటి విమానంలోకి ఎక్కింది. వేల అడుగుల ఎత్తుకు చేరాక విమానంలో నుంచి కిందికి డైవ్ చేసింది. గాల్లో తేలుతూ థ్రిల్ గా ఫీలయ్యింది. తన జీవితంలోనే ఈ స్కై డైవ్ ను మరచ్చిపోలేను అని చెప్పింది మెహ్రీన్.
అండర్ వాటర్ లోనూ..
గత కొద్ది రోజులుగా మెహ్రీన్ విహారయాత్రల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. బీచుల్లో సరదా సరదాగా గడుపుతోంది. సమయం దొరికినప్పుడల్లా సాహసాలు చేస్తోంది. కొద్ది రోజుల కిందట అండర్ వాటర్ డైవ్ చేసి ఆకట్టుకుంటోంది. సముద్ర గర్భంలోని అందాలను తిలకిస్తూ జాలీగా గడిపింది. ఇసుక తిన్నెల్లో సముద్రపు అంచుల్లో ఆహ్లాదంగా గడుపుతోంది. ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఎంజాయ్ అంటే నీదే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే హనీ ఈజ్ బ్రేవ్ అని కొనియాడుతున్నారు.
మాజీ సీఎం మనువడితో ఎంగేజ్ మెంట్, పెళ్లి క్యాన్సిల్
‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మెహ్రీన్.. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీలో పలు సినిమాలు చేసింది. అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుది. కొంత కాలం క్రితం హర్యాన మాజీ ముఖ్యమంత్రి మనువడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే, తాజాగా ‘ఎఫ్-3’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది.
Read Also: ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
RC15 Welcome: రామ్ చరణ్కు RC15 టీమ్ సర్ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం
Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?
Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!
Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!
Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!
AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్