Tollywood Actresses: ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
హీరోయిన్లు సినిమా అవకాశాలు వచ్చినంత కాలం నటిస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని కొనసాగిస్తారు. అలాగే పలువురు తెలుగు హీరోయిన్లు ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలయ్యారు.
భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు సినిమా పరిశ్రమకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. టాలీవుడ్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు దేశ వ్యాప్తంగా అద్భుత విజయాలను అందుకున్న సందర్భాలున్నాయి. అంతేకాదు, తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగానూ క్రేజ్ సాధించారు. కాసేపు ఈ విషయాలను పక్కన పెడితే, టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న పలువురు హీరోయిన్లు, తమ సినీ కెరీర్ తర్వాత ఎన్నారైలను పెళ్లి చేసుకున్నారు. విదేశాల్లో సెటిలై పిల్లా పాపలతో సంతోషంగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు. కొంతమంది హీరోయిన్లు వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతున్నారు. మరికొద్ది మంది హీరోయిన్లు మాత్రం పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇంతకీ ఎన్నారైలను పెళ్లి చేసుకుని, విదేశాల్లో సెటిలై పిల్లా పాపలతో సంతోషంగా సంసార జీవితాన్ని గడుపుతున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
☀లయ
ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో చక్కటి సినిమాలు చేసింది లయ. కుటుంబ కథా చిత్రాల హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘స్వయంవరం’, ‘ప్రేమించు’, ‘మనసున్న మారాజు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘మిస్సమ్మ’ ‘పెళ్లాంతో పనేంటి’ సహా పలు పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఎన్ఆర్ఐ డాక్టర్ శ్రీ గణేష్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీళ్లు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. లయ నిత్యం సోషల్ మీడియాలో రీల్స్ పోస్టు చేస్తూ ఆకట్టుకుంటోంది.
☀గోపిక
‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది గోపిక. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించింది. కొంతకాలం తర్వాత ఎన్నారై అజిలేష్ చాకోని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీళ్లు ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు.
☀అపర్ణ
‘సుందరకాండ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అపర్ణ. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. పెద్దగా సినీ అవకాశాలు రాకపోవడంతో ఎన్నారై శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది.
☀రంభ
తెలుగులో చక్కటి సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రంభ. ఈమె నటించిన పలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. 2010లో ఈ ముద్దుగుమ్మ కెనడాకు చెందిన ఎన్నారై ఇంద్రన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పాపలు, ఓ బాబు ఉన్నాడు.
☀మీరా జాస్మిన్
తెలుగులో పలు సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్.. సినిమా అవకాశాలు లేక పెళ్లి చేసుకుని సంసారంలోకి అడుగు పెట్టింది. దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ టైసన్ ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది.
☀మాధవి
సీనియర్ నటి మాధవి తెలుగులో పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మను వివాహం చేసుకుంది. రాల్ఫ్ శర్మ తండ్రి జర్మనీకి చెందిన వారు. తల్లి ఇండియన్. ప్రస్తుతం మాధవి దంపతులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలున్నారు.
Read Also: రూ.7 లక్షలకు కొన్న ఇల్లు ఇప్పుడు రూ.కోట్లు - ఇదీ ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ లగ్జరీ లైఫ్ స్టైల్