News
News
X

Shraddha Kapoor Lifestyle: రూ.7 లక్షలకు కొన్న ఇల్లు ఇప్పుడు రూ.కోట్లు - ఇదీ ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ లగ్జరీ లైఫ్ స్టైల్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ లగ్జరీ లైఫ్ గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ముంబైలో సముద్రపు తీరంలో భారీ బంగళా, కోటిన్నర విలువైన BMW 7 సిరీస్ కారు ఇంకా ఇలా చాలానే ఉన్నాయ్.

FOLLOW US: 
Share:

బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో కలిసి ‘తు ఝూతి మైన్ మక్కర్’ అనే సినిమాలో నటిస్తోంది. లవ్ రంజన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2023 హోలీ కానుకగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

శ్రద్ధ బాలీవుడ్ లో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోయిన్లలో ఒకరు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ రూ.81 కోట్ల విలువ చేసే నికర ఆస్తులను కలిగి ఉంది. ముంబై జుహూలె కపూర్ కు విలాసవంతమైన ఇల్లు ఉంది. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రద్ధ లైఫ్ స్టైల్, ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 

1. ముంబైలో విలాసవంతమైన ఇల్లు

సినీ తారలు ఎక్కువగా నివసించే ఏరియా జుహూలో తన తల్లి, సోదరుడు సిద్ధాంత్ కపూర్ తో కలిసి ఉంటుంది. సముద్రానికి ఎదురుగా ఉండే విలాసవంతమైన ఇంట్లో నివసిస్తోంది. తన తండ్రి 1987లో 3-BHK సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌ మెంట్‌ ను రూ. 7 లక్షలతో కొనుగోలు చేయగా, ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం ఫ్లోర్‌ కొనుగోలు చేసింది. సముద్రపు వ్యూతో ఈ ఇల్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఇల్లు రూ.కోట్లు విలువ పలుకుతోంది. అయితే, ప్రస్తుత మార్కెట్ విలువ ఎంతనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

2. లగ్జరీ కార్లు   

శ్రద్ధా కపూర్ రూ.కోటిన్నర విలువ చేసే విలాసవంతమైన BMW 7 సిరీస్‌ కారును కలిగి ఉంది.  సుమారు కోటి రూపాయలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, దాదాపు రూ.83.32 లక్షలు ఖరీదు చేసే ఆడి క్యూ7 కార్లు ఉన్నాయి. అయితే, ఈ కార్లను తనకు నచ్చినట్లుగా మార్పులు చేర్పులు చేయించుకోవడంతో ఈ విలువ మరింత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.    

3. రెమ్యునరేషన్  

IMDb నివేదిక ప్రకారం 2022లో అత్యధికంగా సంపాదిస్తున్న నటీమణులలో ఆరవ స్థానాన్ని దక్కించుకున్నది శ్రద్ధా కపూర్. పాత్రను బట్టి ఒక్కో సినిమాకు రూ.7 నుంచి 23 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.  

4. ఎండర్స్‌మెంట్స్  

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్రద్ధా కపూర్ వివిధ బ్రాండ్ ఎండార్స్‌‌మెంట్ల నుంచి రూ. 6 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆమె హెర్షేస్, రియల్‌ మీ, మెలోరా, హోమ్‌ సెంటర్ లాంటి ప్రముఖ బ్రాండ్‌ లను శ్రద్ధా ప్రమోట్ చేస్తోంది.

5. నికర ఆస్తులు

శ్రద్ధా కపూర్ CA నాలెడ్జ్ ప్రకారం రూ. 81 కోట్ల రూపాయల నికర సంపదను కలిగి ఉంది. సినిమాలతో పాటు యాడ్స్ ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయలను సంపాదిస్తోంది.   

6. అంతర్జాతీయ పర్యటనలు

శ్రద్ధా కపూర్ కు విదేశీ టూర్లంటే ఎంతో ఇష్టం. ఈమె ప్రకృతి అందాలను చూస్తూ మైమరచిపోతుంది. మాల్దీవుల్లో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం అంటే శ్రద్ధా చాలా ఇష్టమంట. ఎక్కువగా లండన్‌ వెళ్లి వస్తుందట. విదేశీ ప్రయాణ అవకాశం వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోదు.

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

Read Also: అందుకే, నా ప్లేస్‌లో వేరేవారిని తీసుకున్నారు - మృణాల్ ఠాకూర్

Published at : 17 Dec 2022 04:13 PM (IST) Tags: Shraddha Kapoor Shraddha Kapoor lifestyle Shraddha Kapoor house Shraddha Kapoor BMW 7 Series Car

సంబంధిత కథనాలు

Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?

Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?

Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్

Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..

సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి