USA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP Desam
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ పై రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి మరోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్షుడి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ద వైట్ హౌస్ లేదా శ్వేతభవనం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా ప్రెసిడెంట్ నివాస, కార్యాలయం వైట్ హౌస్. ఇక్కడి నుండే అమెరికన్ ప్రెసిడెంట్ కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకుంటారు. అమెరికాకు సంబంధించినవైనా, ఇతర దేశాలకు సంబంధించిన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి. ఇంతటి ప్రాముఖ్యమైన వైట్ హౌస్ చరిత్ర, ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో చూద్దాం.
1.
వైట్ హౌస్ నిర్మాణం 1792లో ప్రారంభమై 1800 నాటికి పూర్తి అయింది. జేమ్స్ హోబన్ అనే ఐరిష్ ఆర్కిటెక్ దీన్ని రూపొందించారు. నియో క్లాసికల్ పద్ధతిలో ఈ బిల్డింగ్ నిర్మించారు. 18 ఎకరాల్లో ఉంటుంది వైట్ హౌస్. మేరీ ల్యాండ్, వర్జినీయా రాష్ట్రాల మధ్య పోటామాక్ నదీ సమీపంలో ఉంటుంది వైట్ హౌస్. దీన్ని ఎంపిక చేసింది అమెరికా తొలి అధ్యక్షుడు అయిన జార్జ్ వాషింగ్టన్. కానీ ఆయన వైట్ హౌస్ లో మాత్రం నివసించలేదు. ఆయన 1789 నుంచి 1797 వరకు అమెరికాకు అధ్యక్షుడిగా పని చేశారు. ఈ నిర్మాణం 1800 సంవత్సరంలో పూర్తయింది.
2.
అమెరికా రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ (1797- 1801) వైట్ హౌస్ లో నివాసమున్న తొలి అధ్యక్షుడిగా రికార్డులకు ఎక్కారు. ఆ తర్వాత వచ్చిన ధామస్ జెఫర్సన్, అబ్రహాం లింకన్ నుంచి మొదలుపెట్టి..ఒబామా, ట్రంప్, జో బైడెన్ వరకూ అధ్యక్షులంతా వైట్ హౌస్ లోనే నివసించారు.
3.
వైట్ హౌస్ లో మొత్తం ఆరు ఫ్లోర్లు ఉన్నాయి. 16 ఫ్యామిలీ గెస్ట్ రూంలు ( 132 గదులు), 35 బాత్రూంలు, 28 పైర్ ప్లెసెస్, 8 స్టెయిర్ కేస్ లు, మూడు ఎలివేటర్స్, 412 డోర్లు, 147 కిటికీలు ఉంటాయి.1000 మంది సందర్శకులకు సైతం భోజనం పెట్టే స్థాయి కిచెన్ వైట్ హౌస్ లో ఉంటుంది. నాలుగు నుంచి ఆరేళ్లకోసారి ఈ భవనానికి రంగు వేస్తారు. దీని కోసం 570 గ్యాలన్ల పెయింట్ వాడతారు. ఇండోర్ , అవుట్ డోర్ స్విమ్మింగ్ ఫూల్స్ ఉన్నాయి.
4. వైట్ హోస్ లో అనేక రహస్య గదులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అయితే వైట్ హౌస్ హిస్టారికల్ అసోషియేషన్ వారు చెప్పిందేంటంటే అధ్యక్షుడి ప్రాణాలకు ప్రమాదం ఉంటే అక్కడి నుంచి బయటపడటానికి రహస్య మార్గాలు ఉన్నాయని మాత్రమే చెప్పారు.
5.
వైట్ హౌస్ కు ఆ పేరు ఎలా వచ్చింది. దీని నిర్మాణంలో తెల్ల రాయిని వాడలేదు. ఆక్వా క్రీక్ శాండ్ స్టోన్ తో కట్టారు ఈ భవనాన్ని. ఇది పూర్తిగా తెల్లగా ఉండదు. కానీ ఇది కొన్ని ప్రాంతాల్లో తెల్లగాను, మరి కొన్ని ప్రాంతాల్లో గోధుమ రంగులో కనిపిస్తుంది. కట్టడం పూర్తయిన సమయం 1800 కాలంలో దీన్ని వైట్ హౌస్ గా ఎవరూ పిలవలేదు. దీన్ని అమెరిక్ ప్రెసిడెంట్ హౌస్, ఎగ్జిక్యూటీవ్ మేన్షన్ అని పిలిచేవాళ్లు. అమెరికా నాలుగో అధ్యక్షుడు జెమ్స్ మాడిసన్ పాలనా కాలంలో వైట హౌస్ అన్న ప్రాచుర్యంలోకి వచ్చింది. హెన్రీ. ఎస్. ట్రెంట్ అనే పత్రికా రచయిత తన వ్యాసాల్లో వైట్ హౌస్ పేరు ఎక్కువ సార్లు రాయటం ద్వారా ఈ పేరు ప్రాచుర్యం పొందినట్లు చరిత్ర చెబుతోంది.