ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్
ఇజ్రాయెల్ ఆర్మీలోని Shaldag Commando Unit దక్షిణ లెబనాన్ లో ఓ ప్రత్యేక సైనిక ఆపరేషన్ చేపట్టినట్లుగా ప్రకటించింది. హెజ్బొల్లాకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ బలగాలు దక్షిణ లెబనాన్ లోని హెజ్బొల్లాకు చెందిన కీలక రహస్య ఆయుధాగారాలను గుర్తించాయి. వీటినే హెజ్బొల్లా లెబనాన్ ప్రజలపైన, ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుందని.. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. ఇక పొలిటికల్ ఆర్డర్స్ ను అనుసరించి తాము లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నామని.. సైన్యం ప్రకటించింది. ఇజ్రాయల్ డిఫెన్స ఫోర్స్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని వారి స్థావరాల్లో నిలకడగా ఉన్నాయని తెలిపింది. ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ లెబనీస్ భూభాగంలో పనిచేయడానికి రెడీగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించే ఎవరికైనా వ్యతిరేకంగా IDF పనిచేస్తుందని సైన్యం ప్రకటన విడుదల చేసింది.
ట్రెండింగ్ వార్తలు






















