Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Honda Activa Electric Launched: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. జనవరిలో దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.
Honda Activa Electric Range: ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటీని కంపెనీ ఎట్టకేలకు అందజేసింది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ మార్కెట్లోకి విడుదలైంది. దీంతో పాటు హోండా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ క్యూసీ1ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. ప్రీమియం ఈవీ అయిన హోండా యాక్టివా ఈ గురించి మాట్లాడుదాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే ఈ ద్విచక్ర వాహనంలోని బ్యాటరీని కూడా బయటకు తీయవచ్చు. వీటికి సంబంధించిన ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. సేల్ ప్రారంభం అయ్యే ముందు ప్రకటించే అవకాశం ఉంది.
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ రేంజ్ ఎంత?
హోండా యాక్టివా ఈ 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. దీనిని హోండా పవర్ ప్యాక్ ఎక్స్ఛేంజర్ ఈ-బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లో రీప్లేస్ చేయవచ్చు. ఈ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ ఐడీసీ రేంజ్ 102 కిలోమీటర్లుగా ఉంది. ఈ స్కూటర్‌లోని బ్యాటరీ 6 కేడబ్ల్యూ పవర్‌ని అందిస్తుంది. 22 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా యాక్టివా ఈ గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని పేర్కొంది. దీంతో పాటు ఈ స్కూటర్ 7.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది.
Also Read: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ కారు వచ్చేసింది - మహీంద్రా బీఈ 6ఈ ధర ఎంత?
హోండా యాక్టివా ఈ వేరియంట్లు...
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ రెండు వేరియంట్లతో మార్కెట్లోకి వచ్చింది. ఒకటి స్టాండర్డ్, మరొకటి హోండా రోడ్‌సింక్ డ్యుయో. ఈ-స్కూటర్ బరువు 118 కిలోల నుంచి 119 కిలోల మధ్య ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 171 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ ద్విచక్ర వాహనంలో 160 మిల్లీమీటర్ల ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 మిల్లీమీటర్ల రియర్ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ 12 అంగుళాల చక్రాలను కలిగి ఉంది.
యాక్టివా ఎలక్ట్రిక్‌ని ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు?
యాక్టివా ఈలో మూడు రైడింగ్ మోడ్‌లు అందించారు. ఈ స్కూటర్‌ను ఎకో, స్టాండర్డ్, స్పోర్ట్ మోడ్‌లో నడపవచ్చు. దీని బేస్ వేరియంట్ ఐదు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ లిమిటెడ్ ఫంక్షన్‌లతో అందుబాటులో ఉంది. అదే సమయంలో దాని టాప్ వేరియంట్ రోడ్‌సింక్ డ్యుయో ఏడు అంగుళాల డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ కోసం ప్రీ-బుకింగ్ 2025 జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్కూటర్ డెలివరీ ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుంది.
ప్రస్తుతం మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటర్లలో హోండా యాక్టివా ముందంజలో ఉంది. హోండా యాక్టివాతో పాటు సుజుకి యాక్సెస్ కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్న స్కూటీల్లో ఉంది. ఇక ఎలక్ట్రిక్ స్కూటీల్లో ఓలా, ఏథర్ కంపెనీలకు సంబంధించిన స్కూటీలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లకు సిటీల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. కాబట్టి అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందిస్తున్నాయి.
Also Read: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?