అన్వేషించండి

Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్

Pawan Kalyan News Telugu: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ పాన్ ఇండియా పొలిటిషన్‌గా మారిపోయారు. పార్టీని కూడా జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Pawan Kalyan News: జనసేనాని పవన్ కల్యాణ్ తన టార్గెట్ పెంచారు. రాష్ట్ర స్థాయినేత నుంచి జాతీయస్థాయి పొలిటిషయన్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానని పాలిటిక్స్‌లో అడుగు పెట్టిన పవన్ పదేళ్లలోపే ఒక రాష్ట్రనికి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. 

డిజాస్టర్ పొలిటిషయన్‌గా ట్రోలింగ్ 
2014 నుంచి జన సేనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ మొదట్లో ఎదురు దెబ్బలే తిన్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. ఆయన్ని వైసిపి నేతలు గత ఐదేళ్లు విపరీతంగా ట్రోల్ చేశారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పవన్‌కు హ్యాండ్ ఇచ్చేశారు. 

పాలిటిక్స్‌లో డిజాస్టర్‌గా ట్రోలింగ్ ఎదుర్కొన్న పవన్ కల్యాణ్ 2024 ఎన్నికలు వచ్చేసరికి విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓటమిలో గేమ్ చేంజర్‌ పాత్ర పోషించింది పవనే. అంతేకాకుండా ఎడమొఖం పెడముఖంగా ఉన్న బీజేపీ టిడిపిని ఏకతాటిపైకి తెచ్చింది ఆయనే. ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ ప్రభావాన్ని గుర్తించిన బీజేపీ ఆయనను తెలుగు వాళ్ళ ప్రభావం ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం కోసం వాడుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో పవన్ ఆలోచనలు మరో విధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి  

జాతీయ పార్టీనేతగా ఎదిగేందుకు ప్రయత్నాలు
2024 ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌కు తోడు ఇటీవల మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన 11సీట్లలో ఏకంగా 10సీట్లు బీజేపీ కూటమి గెలుచుకుంది. దీంతో నేషనల్ లెవెల్‌లో పవన్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఆపై ఏడాది వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పవన్‌తో ప్రచారం చేయించే ఆలోచనలో బిజెపి ఉంది. అలాగే స్థానిక నేతలను జనసేనలో చేర్పించి వారితో పోటీ కొన్ని స్థానాల్లో చేయించే ఆలోచన జనసేన చేస్తోంది. ఢిల్లీ తమిళనాడు రాష్ట్రాల్లో అలాంటి స్థానాలు అంటే తెలుగు ఓటర్ల డామినేషన్ ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలాంటి చోట్ల జనసేన పోటీలోకి దిగితే ఎలా ఉంటుందని ఆలోచన జనసేన పెద్దలు చేస్తున్నట్టు సమాచారం.

అందరితో కలివిడిగా కలిసిపోతున్న పవన్ 
ఇటీవల వరకు పవన్ కల్యాణ్ మీద ఒక ముద్ర ఉండేది. అందరితో కలవరని బిడియం బాగా ఎక్కువ అని జనసేన నేతలే చెప్పుకునేవారు. అయితే ఇటీవల విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ పవన్ వ్యవహార శైలిని మార్చేసింది. దీనికి తోడు పవన్ కల్యాణ్‌కు వివిధ భాషలపై ఉన్న పట్టు కూడా ఆయన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తుందని అంటారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసిన వాళ్లు కేవలం మాతృ భాషతో లేదా ఇంగ్లీష్‌తో మేనేజ్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు హిందీపై ఉన్న పట్టు కూడా కలిసి వస్తుందని అంటారు. మూడు రోజులపాటు ఢిల్లీ టూర్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలవడంతోపాటుగా వారందరికీ తాజ్ హోటల్‌లో ఒక విందు కూడా ఏర్పాటు చేశారు పవన్.

కేంద్ర మంత్రులతోపాటు కూటమి ఎంపీలు, పలువురు జాతీయ స్థాయి నేతలు ఈ విందుకు హాజరయ్యారు. ఆ విందు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా చూస్తున్న పొలిటికల్ ఎనలిస్టులు పవన్ వ్యవహార శైలిలో వచ్చిన మార్పును విశ్లేషిస్తున్నారు. ఒక జాతీయస్థాయి నేతకు ఉండాల్సిన లక్షణాలను పవన్ అలవర్చుకున్నారని రానున్న రోజుల్లో దాని ప్రభావం కచ్చితంగా నేషనల్ పాలిటిక్స్‌లో కనిపిస్తుంది అని అంచనాలు వేస్తున్నారు. మరి వారి అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో చూడాలి.

Also Read: జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
Embed widget