Thangalaan Movie: సమ్మర్‌కి షిఫ్ట్ అయిన విక్రమ్ 'తంగలాన్' - రిలీజ్ ఎప్పుడంటే?
Thangalaan : విక్రమ్ 'తంగలాన్' మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల కాబోతోంది. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Vikram’s Thangalaan postponed to April: కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'తంగలాన్'. చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ మరోసారి ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో కనిపించనున్నాడు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా మూవీ రూపొందుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కోసం విక్రమ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఓ ప్రత్యేక గెటప్ లో కనిపించనున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
2024 రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే... ఈ నెలలో సినిమా రావడం లేదు. జనవరి బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకొంది. ఈ సినిమా రిలీజ్ సమ్మర్ కు షిఫ్ట్ అయినట్లు వార్తలు రాగా... సంక్రాంతి పండగ సందర్భంగా మూవీ టీం విడుదల వాయిదాపై క్లారిటీ ఇస్తూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.
History awaits to be written in blood and gold 🌟👑#ThangalaanFromApril2024#HappyPongal🌾 #HappyMakarSankranti🌞 @Thangalaan @chiyaan @beemji @GnanavelrajaKe #StudioGreen @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @agrajaofficial… pic.twitter.com/fAEZkmpVp1
— Studio Green (@StudioGreen2) January 15, 2024
సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది 'తంగలాన్' చిత్ర బృందం. ఈ మేరకు మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఏ రోజున విడుదల చేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా 'తంగలాన్' రిలీజ్ ని రిపబ్లిక్ డే నుంచి సమ్మర్ కి షిఫ్ట్ చేయడానికి కారణం సినిమాని ఫిలిం ఫెస్టివల్స్ కు పంపడమే అని చెబుతున్నారు.
ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ మూవీకి మంచి అప్లాజ్ వస్తుందని, దాంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుందని, అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని... నిర్మాత సినిమాను వాయిదా వేసినందుకు నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫిల్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ తెగ గురించే తంగలాన్ సినిమా ఉండబోతోంది. ఇందులో విక్రమ్ తెగ నాయకుడిగా కనిపించబోతున్నాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన విక్రమ్ ఫస్ట్ లుక్ తో వైవిధ్యంగా ఉంది. ఈ మూవీ కోసం విక్రమ్ చాలా కష్టపడుతున్నాడు. ఇందులో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు హీరోయిన్స్ గా నటిస్తుండగా.. పశుపతి, డానియల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్ - ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చంటే?