Paramporul OTT Release: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్ - ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చంటే?
Paramporul OTT Release: కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘పరంపోరుల్’. శరత్ కుమార్, అమితాష్ ప్రధాన్ కీలక పాత్రలు ఈ మూవీ తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో విడదల కాబోతోంది.
Paramporul OTT Release: తమిళ సినిమా పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమా ‘పరం పోరుల్’. శరత్ కుమార్, అమితాష్ ప్రధాన్ ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తోంది.
చిన్న సినిమా, పెద్ద హిట్
‘పరం పోరుల్’ సినిమా తమిళనాడులో గత ఏడాది సెప్టెంబర్ 1న విడుదల అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి షో నుంచే పాజిటివ్ తెచ్చుకుంది. సినిమాల కథ, స్క్రీన్ ప్లే పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రంలో శరత్ కుమార్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుమారు రూ. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
View this post on Instagram
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అరవింద్ రాజ్
'పరం పోరుల్' సినిమా షూటింగ్ 2021లో ప్రారంభం అయ్యింది. అయితే, రకరకాల కారణాలో షూటింగ్ చాలా నెమ్మదిగా కొనసాగింది. సుమారు రెండు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి సీ అరవింద్‌రాజ్ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ‘పరంపోరుల్’ సినిమాలో హీరోగా నటించిన అమితాష్ ప్రధాన్ తెలుగులో పలు సినిమాల్లో నటించాడు. రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’తో పాటు నాగశౌర్య ‘కృష్ణ వింద విహారి’ సినిమాలో కీలక పాత్రల పోషించాడు. ‘పరంపోరుల్’తో కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు. కశ్మీరా పరదేశీతో పాటు బాలాజీ శక్తివేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో యువన్ శంకర్ రాజా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. ఈ సినిమా విజయంలో ఆయన ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది.
‘పరంపొరుల్’ స్టోరీ ఏంటంటే?
ఆది(అమితాష్ ప్రధాన్) డబ్బు కోసం పురుతాన విగ్రహాలను దొంగిలించే స్మగ్లర్లతో చేతులు కలుపుతాడు. కానీ, కొన్నికారణాలతో పోలీసు అధికారి మైత్రేయన్(శరత్ కుమార్)తో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తాడు. ఆ అంగీకారం ఆది జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అనేది సినిమా కథ. ఈ సినిమాలో శరత్ కుమార్ నటనకు మంచి గుర్తింపు లభించింది. గత ఏడాది ఆయన సుమారు పది సినిమాల్లో నటించారు. తెలుగులో ‘కస్టడీ’, ‘రంగబలి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాల్లో నటించి మెప్పించారు.
Read Also: ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్, ఒకే వారంలో 45 సినిమాలు విడుదల