అన్వేషించండి

Family Star: మధురము కదా... రెండు అప్డేట్స్ ఇచ్చిన 'ఫ్యామిలీ స్టార్' విజయ్ దేవరకొండ

Family Star Trailer Release Date: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ విడుదల తేదీ అనౌన్స్ చేశారు.

Family Star third single 'Madhurame Kadha' to release on March 25th: 'ది' విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఇందులో ఆయన జోడీగా 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాల ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్వరలో సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 

మార్చి 28న 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ విడుదల
Family Star Trailer: మార్చి 28... అంటే రాబోయే గురువారం రోజు 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అనౌన్స్ చేసింది. దాంతో పాటు మరో అప్డేట్ కూడా ఇచ్చింది. సినిమాలో మూడో పాట 'మధురము కదా...'ను మార్చి 25 (సోమవారం) విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

'ఫ్యామిలీ స్టార్' నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల అయ్యాయి. అందులో తొలి పాట 'నందనందా...' ఆల్రెడీ 25 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుంది. 'గీత గోవిందం' సినిమాకు సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన గోపీసుందర్ మరోసారి ఈ సినిమాకు సైతం సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చినట్లు ఆ సాంగ్ వింటే అర్థం అవుతోంది. 'గీత గోవిందం'లో 'ఇంకేం ఇంకేం కావాలో...' పాటను సిద్ శ్రీరామ్ పాడిన సంగతి తెలిసిందే. ఆయన 'నందనందనా' పాడారు. ఆ తర్వాత 'కల్యాణీ వచ్చా వచ్చా' విడుదల చేశారు. దానికీ మంచి స్పందన లభించింది. ఇప్పుడు మూడో పాట 'తెలుసు కదా' ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: వెంకటేష్, అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... ఆయన ఎవరంటే?

ప్రైమ్ వీడియో చేతికి 'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ రైట్స్!
'ఫ్యామిలీ స్టార్' సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ఓటీటీ డీల్ ఆల్రెడీ క్లోజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఫ్యాన్సీ రేటుకు స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తెరకెక్కుతున్న 54వ చిత్రమిది. సోదరుడు శిరీష్ (Shirish Producer)తో కలిసి ఆయన ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Also Read: అక్షయ్ కుమార్, టైగర్ షాఫ్ర్... ఇద్దరికీ 2024లో ఫస్ట్ సినిమా ఇదే - లాస్ట్ ఇయర్ ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పడుతుందా?

'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్ మెయిన్ హీరోయిన్ కాగా... 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఓ కీలక పాత్ర చేశారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఓ విదేశీ భామ సైతం ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

KilleR Movie: మూవీ ట్విస్ట్‌ కనిపెట్టండి... కోటి గెలుచుకోండి - 'కిల్లర్' టీమ్ బంపర్ ఆఫర్
మూవీ ట్విస్ట్‌ కనిపెట్టండి... కోటి గెలుచుకోండి - 'కిల్లర్' టీమ్ బంపర్ ఆఫర్
Ramayana OTT: ఆ ఓటీటీలోకి 'రామాయణ'... కానీ ఓ ట్విస్ట్, సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలదు గురూ
ఆ ఓటీటీలోకి 'రామాయణ'... కానీ ఓ ట్విస్ట్, సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలదు గురూ
Actress Rajitha: మమ్మల్ని పక్కన పెట్టి పరభాషా నటీమణులకు ఛాన్సులు... సీనియర్ నటి రజిత ఆవేదన
మమ్మల్ని పక్కన పెట్టి పరభాషా నటీమణులకు ఛాన్సులు... సీనియర్ నటి రజిత ఆవేదన
The Paradise OTT: నెట్‌ఫ్లిక్స్‌లో నాని ప్యారడైజ్ స్ట్రీమింగ్ షురూ... ఎన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చిందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన నాని ప్యారడైజ్... ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? ఎన్ని భాషల్లో ఉందంటే?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget