అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vijay Devarakonda Comments: వీడికి పోగరని తిట్టుకున్న పర్వలేదు, ఈసారి రూ.200 కోట్లు కొడుతా - 'లైగర్‌' ప్లాప్‌పై విజయ్‌ కామెంట్స్‌

Vijay Deverakonda: 'ఫ్యామిలీ స్టార్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ మాట్లాడుతూ 'లైగర్‌' మూవీ టైంలో చేసి తప్పునే మళ్లీ రిపీట్ చేశాడు. ఈ సినిమాతో 200 కోట్లు కొడతానంటూ ఓవర్‌ కాన్ఫీడెన్స్‌ చూపించిన విజయ్‌

Vijay Devarakonda Speech at Family Star Pre Release event: 'రౌడీ' హీరో విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. ఏప్రిల్‌ 5న మూవీ థియేటర్లో సందడి చేయబోతుంది. బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌, వందకోట్ల సినిమా అందించిన పరశురాంతో కలిసి విజయ్‌ చేస్తున్న రెండవ సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై హిట్‌ కాదు వందకోట్లు దాటడం పక్కా అని విజయ్‌ ఫ్యాన్స్‌ అంతా కాలర్‌ ఎగిరేస్తున్నారు. కానీ, విజయ్  మాత్రం మరింత కాన్పిడెన్స్ చూపిస్తున్నాడు. ఈ సినిమా రెండు వందల కోట్లు పక్కా అంటున్నాడు. 

నిన్న జరిగిన  'ఫ్యామిలీ స్టార్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ మాట్లాడుతూ 'లైగర్‌' మూవీ టైంలో చేసి తప్పునే మళ్లీ రిపీట్ చేశాడు. 'లైగర్' టైంలో  సినిమాతో 200 కోట్లు కొడతానంటూ ఓవర్‌ కాన్ఫీడెన్స్‌ చూపించిన విజయ్‌ తాజాగా అదే కామెంట్స్‌తో హాట్‌టాపిక్‌ అయ్యాడు. 'ఫ్యామిలీ స్టార్‌'తో రూ. 200 కోట్లు కొడతానంటూ మళ్లీ అవే కామెంట్స్‌ చేసి ట్రోలర్స్‌ చేతికి చిక్కాడు. ఇంతకి ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ విజయ్‌ ఏం అన్నాడంటే.. "ఆరేళ్ల క్రితం ఇదే డైరెక్టర్‌తో నా కెరీర్‌లోనే బిగ్గేస్ట్‌ హిట్‌ ఇచ్చాను. అదే 'గీతా గోవిందం'. అన్ని వర్గాలను ప్రేక్షకులు మెచ్చుకున్న సినిమా అది. మళ్లీ అలాంటి సినిమా ఎప్పుడు తీస్తావ్‌ విజయ్‌ అంటూ నా ఫ్యాన్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ అంతా నన్ను అడుగుతున్నారు.

'గీతా గోవిందం' తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమా చేశాను. కానీ, అలాంటి హిట్‌ మాత్రం ఇవ్వలేకపోయాను. ఎవడే సుబ్రమణ్యం మూవీ టైంలో అనుకుంట.. ఏదో ఇంటర్య్వూలో విజయ్‌ నీ గురించి ఎలాంటి గాసిప్‌ వినాలనుకుంటున్నావ్‌ అని అడిగారు. అప్పుడు నేను విజయ్‌ దేవరకొండ సినిమా రూ. 100 కోట్లు కొట్టిందని వినాలనుకుంటున్నా అని చెప్పాను. అదీ 'గీతా గోవిందం'తో నెరవేరింది. ఆ తర్వాత అందరి నుంచి ఎన్నో ప్రశంసలు, అభిమానాలు, ప్రేమలు చూశాను. తర్వాత అదే ప్రయత్నం ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ చేయాలని ట్రై చేశా. కానీ, ఇప్పటి వరకు 'గీతా గోవిందం'ను బీట్‌ చేసిన సినిమా రాలేదు" అంటూ చెప్పుకొచ్చాడు. 

మళ్లీ మళ్లీ అదే స్టేట్ మెంట్!

అనంతరం మాట్లాడుతూ.. "అదే వందకోట్లు కోట్లు కొట్టిన పిల్లాడు.. రూ. 200 కోట్లు కొడతానంటూ ఓ సినిమాకు చెప్పాడు. ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు కానీ, కొట్టలేదు. ఆ టైం నేను చేసిన కామెంట్స్‌కి నన్ను విమర్శించారు. 'నువ్వు అలాంటి స్టేట్‌మెంట్‌ ఎందుకు ఇచ్చాడు.. నీ వయసులో కెరీర్‌లో అలాంటివి మాట్లాడకుడదు. అది అహంకారం (అరోగంట్‌) అనుకుంటారు' అని చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఈ రోజు వరకు కూడా అదే చెబుతూనే ఉంటారు. కానీ, 200 కోట్లు కొడతా అని స్టేట్‌మెంట్‌ ఇవ్వడం తప్పుకాదు..  చెప్పి కొట్టకపోతే తప్పు. కానీ నేను ఎప్పటికైనా 200 కోట్లు కొడతా.. అప్పటి వరకు నేను ఈ స్టేట్‌మెంట్‌ ఇస్తూనే ఉంటా. మీరు నన్ను తల పోగరు, అరోగంట్‌ అనుకున్న పర్వలేదు. కానీ 'ఫ్యామిలీ స్టార్‌'తో మాత్రంరూ. 200 కోట్లు కొడతాను" అంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం విజయ్‌ కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. అయితే అతడి కామెంట్స్‌ని కొందరు సపోర్టు చేసిన విమర్శకుల మాత్రం విజయ్‌ని ఆటాడుకుంటున్నారు. 'లైగర్‌' లాంటి పాన్‌ ఇండియా సినిమా రానీ వసూళ్లు ఫ్యామిలీ స్టార్‌కు ఎలా వస్తాయని, ఇది నిజంగా విజయ్‌ ఓవర్‌ కాన్పిడెన్స్‌ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరి విజయ్‌ చెప్పినట్టు 'ఫ్యామిలీ స్టార్‌' రూ. 200 కోట్లు కొడుతుందా? లేదా? చూడాలి!  

Also Read: 'ఫ్యామిలీ స్టార్' సెన్సార్ రిపోర్ట్ - ఆ నాలుగు డైలాగులూ మ్యూట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget