అన్వేషించండి

Producer K Mahendra Passed Away: టాలీవుడ్‌లో విషాదం... శ్రీహరిని హీరో, కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్ చేసిన సీనియర్ నిర్మాత కే మహేంద్ర మృతి

Producer K Mahendra Death News: తెలుగు చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ఏఏ ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత కె మహేంద్ర మరణించారు. శ్రీహరిని హీరో చేసింది ఆయన మాదాల రవికి మామగారు కూడా!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎఎ ఆర్ట్స్ అధినేత, సీనియర్ నిర్మాత కే మహేంద్ర (K Mahendra Producer) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని రమేష్ హాస్పటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో కన్ను మూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గుంటూరులో ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి...
ఎఎ ఆర్ట్స్ స్థాపించిన నిర్మాతగా మారిన మహేంద్ర
K Mahendra Wiki: కే మహేంద్ర అసలు పేరు కావూరి మహేంద్ర.‌ ఆయనది గుంటూరు. ఫిబ్రవరి 4, 1946లో జన్మించారు. దర్శకుడు కావాలని అనుకున్నారు. సీనియర్ దర్శకులు కే ప్రత్యగాత్మ, కే హేమాంభరధర రావు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. ప్రొడక్షన్ కంట్రోలర్ కింద పలు చిత్రాలకు ఆయన సేవలు అందించారు. 

K Mahendra Movies: 'ప్రేమించి పెళ్లి చేసుకో (1977)' సినిమాతో నిర్మాతగా మారారు మహేంద్ర. ఆ తర్వాత 'ఏది పుణ్యం? ఏది పాపం?', 'ఆరని మంటలు', 'తోడు దొంగలు', 'బందిపోటు రుద్రమ్మ', 'ఎదురలేని మొనగాడు', 'ఢాకూరాణి', ప్రచండ భైరవి', 'కనకదుర్గ వ్రత మహాత్మ్యం' తదితర చిత్రాలు మహేంద్ర ప్రొడ్యూస్ చేశారు. 

శ్రీహరిని హీరో చేసిన నిర్మాత కే మహేంద్ర
కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్ చేసిందీ ఈయనే!

శ్రీహరి కథానాయకుడు కావడం వెనుక మహేంద్ర ఉన్నారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ 'పోలీస్' ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత శ్రీహరితో 'దేవా', 'ఒక్కడు' సినిమాలు నిర్మించారు. చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమైన నందమూరి కళ్యాణ్ రామ్ - దర్శకుడు తేజల 'లక్ష్మీ కళ్యాణం' నిర్మించిందీ ఈయనే. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా 'అర్జున్', ఊహ నటించిన 'ప్రేమ లేని పుట్టిల్లు', కరోనాకు ముందు పోసాని కృష్ణమురళి నటించిన 'దేశముదుర్లు' సినిమాలు నిర్మించారు మహేంద్ర. రాజశేఖర్ 'అర్జునా' సినిమా ఇంకా విడుదల కాలేదు.

Also Read: తెలిసి తప్పు చేయలేదంటోన్న మంగ్లీ... బర్త్ డే పార్టీలో లోకల్ లిక్కర్ తప్ప గంజాయి, మత్తు పదార్థాలు లేవని వివరణ ఇస్తూ వీడియో విడుదల

మాదాల రంగారావు వియ్యంకుడే మహేంద్ర
విప్లవ చిత్రాల దర్శకుడు మాదాల రంగారావుకు మహేంద్ర స్వయానా వియ్యంకుడు. మహేంద్ర కుమార్తెను రంగారావు తనయుడు మాదాల రవి వివాహం చేసుకున్నారు. కుమార్తెతో పాటు మహేంద్రకు ఓ కుమారుడు ఉన్నారు. ఆయన పేరు జీతు. కొంత కాలం క్రితం మరణించారు. కుమారుడి మరణం కూడా మహేంద్రను మానసికంగా కుంగదీసిందని సన్నిహితుల సమాచారం.

Also Read'పడక్కలం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో మలయాళ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్

టాప్ హెడ్ లైన్స్

మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget