Singer Mangli: తెలిసి తప్పు చేయలేదు... లోకల్ లిక్కర్ తప్ప మత్తు పదార్థాలు లేవు - సింగర్ మంగ్లీ వివరణ
Singer Mangli Birthday Party: తనకు తెలిసి తప్పు చేయలేదని మంగ్లీ వివరణ ఇచ్చారు. బర్త్‌డే పార్టీ జరిగిన రిసార్ట్ మీద పోలీసులు రైడ్ చేసి కేసు నమోదు చేసిన ఘటనపై ఆవిడ వీడియో విడుదల చేశారు.

Singer Mangli Birthday Party Case Row: ప్రముఖ గాయని మంగ్లీ పుట్టిన రోజు పార్టీలో అతిథులకు విదేశీ మద్యంతో గంజాయి సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ నగర శివారులలోని చేవెళ్లలో గల ఒక రిసార్ట్‌లో ఆమె బర్త్ డే పార్టీ జరిగింది. అక్కడ విదేశీ మద్యం, గంజాయి లభ్యం అయ్యాయని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివాదం మీద వివరణ ఇస్తూ మంగ్లీ ఒక వీడియో విడుదల చేశారు.
అనుమతి తీసుకోవాలనే అవగాహన లేదు...
నాకు తెలిసి ఎటువంటి తప్పు చేయలేదు - మంగ్లీ
తనకు తెలిసి ఎటువంటి తప్పు చేయలేదని, తన పుట్టిన రోజు పార్టీలో లోకల్ లిక్కర్ తప్ప ఇతర మత్తు పదార్థాలు ఏవి లేవని మంగ్లీ పేర్కొన్నారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''తల్లిదండ్రుల కోరిక మేరకు మా కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో పుట్టిన రోజు పార్టీ చేసుకోవాలని అనుకున్నాం. అదొక బర్త్ డే పార్టీలా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకోవాలనుకున్నా. చివరి నిమిషంలో అనుకోకుండా రిసార్ట్‌లో పార్టీ ప్లాన్ చేశాం. సడన్‌గా ప్లానింగ్ జరిగింది. అక్కడ సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో పాటు లిక్కర్ కూడా ఉంది. అయితే ఆ రెండిటికీ అనుమతి తీసుకోవాలని నాకు ఎవరూ చెప్పలేదు. అనుమతి తీసుకోవాలనే అవగాహన కూడా నాకు లేదు. తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునే దాన్ని'' అని వివరించారు.
Also Read: 'పడక్కలం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌లో మలయాళ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పోలీసులు సెర్చ్ చేసినప్పుడు ఎటువంటి మత్తు పదార్థాలు దొరకలేదని, పార్టీలో లోకల్ లిక్కర్ తప్ప విదేశీ మద్యం లేదని మంగ్లీ చెబుతున్నారు. ఎవరికి అయితే గంజాయి తాగినట్టు పాజిటివ్ వచ్చిందో అతను అంతకు ముందు ఎక్కడో తీసుకుని వచ్చాడని, గంజాయి ఎప్పుడో తీసుకున్నట్లు తేలిందని పోలీసులే తెలిపారని మంగ్లీ పేర్కొన్నారు. దానిపై విచారణ జరుగుతోందని తాము పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని ఆవిడ వివరించారు.
తల్లిదండ్రుల దగ్గర ఇటువంటి పనులు చేస్తానా?
పుట్టిన రోజు పార్టీలో తన తల్లిదండ్రులు కూడా ఉన్నారని వాళ్లను దగ్గర పెట్టుకుని మత్తు పదార్థాలను తాను ప్రోత్సహిస్తానా? అని మంగ్లీ ప్రశ్నించారు. తాను ఒక రోల్ మోడల్ కింద ఉండాలని అనుకుంటాను కానీ ఇటువంటివి ఎందుకు చేస్తానని ఆవిడ అడిగారు. తనపై లేనిపోని అభియోగాలు మోపవద్దని, ఆధారాలు లేకుండా ఏవి రాయవద్దని మీడియాకు మంగ్లీ విజ్ఞప్తి చేశారు.
#Hyderabad :
— Surya Reddy (@jsuryareddy) June 11, 2025
Singer #Mangli breaks silence on Birthday Party row :
"I hosted a small party for friends and relatives, on my parents' request. I wasn’t aware that Liquor and Sound permissions were needed. No #Drugs were used, only local #liquor served. The person who tested… https://t.co/6cgCMwS0mX pic.twitter.com/gtAyANozGs





















