News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఇంట్లో నుంచి గెంటేశారు, నా కొడుకు కూడా నాతో మాట్లాడట్లేదు - కన్నీళ్లు పెట్టుకున్న వనితా విజయ్ కుమార్

వనితా విజయ్‌కుమార్ 20 ఏళ్ల వయసున్నప్పుడే ఆకాశ్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ పెళ్లి.. తన కుటుంబానికి తనను పూర్తిగా దూరం చేసింది.

FOLLOW US: 
Share:

కోలీవుడ్ సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజులాల పెద్ద కుమార్తె వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఆమె ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నరేష్‌కు మూడో భార్య పాత్రలో కనిపించింది. అయితే, ఆమె సినిమాల్లో కంటే.. వ్యక్తిగత విషయాల్లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

అమ్మ మనస్థత్వం అలాంటిది..
వనితా విజయ్‌కుమార్ 20 ఏళ్ల వయసున్నప్పుడే ఆకాశ్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ పెళ్లి.. తన కుటుంబానికి తనను పూర్తిగా దూరం చేసింది. అంత చిన్న వయసులో ప్రేమ, పెళ్లి, వివాహం, విడాకులు లాంటివి ఎలా హ్యాండిల్ చేశారంటూ తనకు ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురయ్యింది. ‘ప్రేమించడం తప్పు, ప్రేమ పెళ్లి అనేది తప్పు అనుకుంటారు. వాళ్లకి అది నచ్చినా, నచ్చకపోయినా ఇలాగే ఉండాలి అని ఫిక్స్ అయిపోయారు. మా అమ్మ.. ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడు కూడా స్పీకర్‌లో పెట్టి మాట్లాడు అని చెప్పేది. అమ్మ కొంచెం అతిజాగ్రత్తగా చూసుకునేది. అన్ని విషయాల్లో అతిజాగ్రత్త మధ్య పెరిగితే.. ఆటోమేటిక్‌గా రెబెల్ అయిపోతారు.’ అంటూ ముందుకు తన కుటుంబం గురించి చెప్పుకొచ్చింది వనితా.

ఆకాశ్‌తో తన మొదటి పెళ్లి గురించి కూడా స్పష్టంగా బయటపెట్టింది వనితా. ‘రెండేళ్లకు పైగా తనతో కలిసున్నాను. అప్పటికే అబ్బాయి పుట్టాడు. అయినా కూడా మా మధ్య సంబంధం అంత మంచిగా ఉండేది కాదు. నా కొడుకు మాత్రమే జరుగుతున్న దారుణాలకు సాక్షిగా ఉన్నాడు. అంత చిన్న వయసులో నా పరిస్థితిని అర్థం చేసుకొని, నా నిర్ణయాలను సపోర్ట్ చేసేవాడు. మూడేళ్లు ఉన్నప్పుడే ఎందుకిలా ఉంటున్నావ్ అంటూ నా మీద అరిచేవాడు. నా కొడుకు మాత్రమే నాకు చాలా బలాన్ని ఇచ్చాడు. నేను బ్రతికుండడానికి కారణంగా అనిపించాడు. తన పేరు విజయ్ శ్రీహరి’ అని తన కొడుకు గురించి గర్వంగా తెలిపింది వనితా.

నా కొడుకే నా ధైర్యం అనుకున్నా కానీ..
‘పాపతో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే నా పెళ్లికి నేను ఫుల్‌స్టాప్ పెట్టేసి విడాకులకు అప్లై చేశాను. ఆ సమయంలో నా తల్లిదండ్రులు నాకు అసలు సపోర్ట్ చేయలేదు. ఇంట్లో నుండి గెంటేశారు. విడాకులు తీసుకోవద్దు అన్నారు నేను వినలేదు. నాలుగేళ్లు నాకు నరకంలాగా ఉన్నా.. అందులో నాతో ధైర్యంగా నిలబడింది నా కొడుకు మాత్రమే. కానీ ఇప్పుడు తను నాతో లేడు. తనను నాతో ఉంచుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది జరగలేదు. అప్పట్లో నాకు అంత ధైర్యం ఇచ్చిన కొడుకు నాకు అసలు కాంటాక్ట్‌లో లేడు.’ అంటూ ఎమోషన్ అయ్యింది వనతా. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా భాగస్వామితో వనతాకు సంతోషం దొరకలేదు. సర్వస్వం అనుకున్న కొడుకు కూడా తనతో లేడు. ప్రస్తుతం వనితా విజయ్‌కుమార్ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని ఇంటర్వ్యూ చూసినవారు అంటున్నారు. ఏం జరిగినా కుటుంబం తనను వద్దనుకున్నా కూడా తను మాత్రం విజయ్‌కుమార్ వారసురాలని గర్వంగా చెప్తోంది వనితా.

Also Read: ‘డాన్ 3’లో హీరోగా రణవీర్ కన్ఫర్మ్, మరింత ఆగ్రహంలో షారుఖ్ ఫ్యాన్స్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 09 Aug 2023 01:44 PM (IST) Tags: Vijaykumar Marriage Divorce vanitha vijaykumar

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !