అన్వేషించండి

Don 3: ‘డాన్ 3’లో హీరోగా రణవీర్ కన్ఫర్మ్, మరింత ఆగ్రహంలో షారుఖ్ ఫ్యాన్స్

ప్రేక్షకుల అయోమయానికి చెక్ పెడుతూ ‘డాన్ 3’ మేకర్స్.. టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో డాన్‌గా రణవీర్ సింగ్ పలకరించాడు.

ఫ్రాంచైజ్ సినిమాలకు హాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అందుకే బాలీవుడ్ కూడా అదే తరహాలో ఫ్రాంచైజ్ చిత్రాలు తెరకెక్కించడం మొదలుపెట్టింది. కానీ ఇలాంటి చిత్రాలను ఒకే దర్శకుడు, ఒకే నటుడితో చేయడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఫ్రాంచైజ్‌లను ముందుకు తీసుకెళ్లాలంటే ఒక్కొక్కసారి దర్శకుడు, నటుడు.. ఇలా ఎవరైనా మారుతూ ఉండవచ్చు. తాజాగా బాలీవుడ్‌లో ‘డాన్’ ఫ్రాంచైజ్ విషయంలో కూడా అదే జరిగింది. షారుఖ్ ఖాన్ స్థానంలోకి రణవీర్ సింగ్ డాన్‌గా వస్తాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రేక్షకుల అయోమయానికి చెక్ పెడుతూ ‘డాన్ 3’ మేకర్స్.. టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ‘డాన్‌’గా రణవీర్ సింగ్ ప్రేక్షకులను పలకరించాడు. అంతే కాకుండా దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. షారుఖ్ ఫ్యాన్స్‌ను కాస్త తృప్తిపరచడం కోసం స్పెషల్ నోట్ కూడా విడుదల చేశాడు.

ముందుగా ‘డాన్ 3’ సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేస్తూ ఒక అనౌన్స్‌మెంట్ వీడియో విడుదలయ్యింది. అప్పటినుంచి ప్రేక్షకులకు ఇందులో షారుఖ్ హీరో కాదనే అనుమానం మొదలైంది. షారుఖ్ స్థానంలో రణవీర్ నటిస్తున్నాడనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇంకా కన్ఫర్మ్ కాకముందే రణవీర్ డాన్‌ మూవీ చేయడం ఏమిటని షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్‌గా ఫైర్ అయ్యారు. ఫర్హాన్ అక్తర్ అవేవి పట్టించుకోకుండా  కొన్ని గంటల్లోనే రణవీర్ సింగే ‘డాన్ 3’లో డాన్ అంటూ టీజర్ విడుదలైంది. ‘డాన్‌’గా రణవీర్ కూడా బాగానే ఉన్నాడంటూ షారుఖ్ ఫ్యాన్స్ ప్రశంసించినా.. ఈ ఫ్రాంచైజ్‌లో తమ ఫేవరెట్ హీరో లేనందుకు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్‌తో పాటు ఫర్హాన్.. ఒక నోట్‌ను కూడా షేర్ చేశాడు.

అప్పటినుండి ఇప్పటివరకు..
‘అది 1978. దేశం మొదటిసారి అమితాబ్ బచ్చన్‌ను డాన్‌గా చూసింది. చాలాకాలం వరకు డాన్.. తన ఛార్మ్ కొనసాగించడంతో ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో మరో డాన్‌ను తెరకెక్కించాలని ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ సంతోషంగా ముందుకొచ్చింది. 2006, 2011లో షారుఖ్ ఖాన్‌తో డాన్ లాంటి యాక్షన్ ఫ్రాంచైజ్‌ను కొనసాగించి.. ఇప్పుడు సరిహద్దులను దాటి కథ చెప్పడానికి మరోసారి డాన్ 3తో ముందుకొస్తున్నాం’ అంటూ ఒక నోట్‌ను ఫర్హాన్ అఖ్తర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా డాన్ ఫ్రాంచైజ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తనకు నచ్చే ఒక హీరో ‘డాన్ 3’లో భాగం కానున్నాడని, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌కు డాన్ పాత్రలు పోషించినప్పుడు ఎలాంటి ప్రేమను అయితే చూపించారో.. ఈ హీరోకు కూడా అలాంటి ఇవ్వాలని ఫర్హాన్ కోరాడు.

రణవీర్ ఫ్యాన్స్ మాత్రం ఖుషి..
‘డాన్ 3’ టీజర్ చూసిన తర్వాత కొంతమంది ప్రేక్షకులు కుదుటపడ్డారు. రణవీర్ సింగ్ కూడా మంచి యాక్టర్ కాబట్టి డాన్ పాత్రలో తన నటన ఆకట్టకుంటుందని వారు నమ్మారు. కానీ మరికొందరు మాత్రం షారుఖ్ లేకపోతే డాన్ ఫ్రాంచైజ్ లేదంటూ నిరసనలు మొదలుపెట్టారు. కొత్త హీరోతో కొత్త ఎరా మొదలు, డాన్ 3.. ఫ్రాంచైజ్‌లోని ముందు సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు అని మేకర్స్ మాటిస్తున్నా కూడా షారుఖ్ ఫ్యాన్స్ శాంతించడం లేదు. ఇదిలా ఉండగా.. మరోవైపు రణవీర్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీలో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత తాజాగా ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’తో బ్లాక్ బస్టర్ అందుకున్న రణవీర్.. త్వరలోనే డాన్‌గా కనిపించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ‘భోళా శంకర్’ సక్సెస్‌పై మెహర్ నమ్మకం, ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’ రేంజ్‌లో ఉంటుందట!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget