అన్వేషించండి

Pooja Hegde: పూజా హెగ్డే ఎఫెక్ట్, గురూజీని ఆడేసుకుంటున్న నెటిజన్స్ - ‘బ్రో’ టీజరే కారణమట!

టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇందుకు కారణం హీరోయిన్ పూజా హెగ్డే అని అంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డైరెక్షన్ తో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. అలాంటి ఈ అగ్ర దర్శకుడి పై ట్రోల్స్ మాత్రం అస్సలు ఆగడం లేదు. సోషల్ మీడియా వచ్చాక ఎంత పెద్ద స్టార్ హీరో, డైరెక్టర్ అయినా కూడా వాళ్ల తప్పుల్ని నెట్టిజన్లు ఎత్తిచూపుతున్నారు. ట్రోల్స్ తో ఆడేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'బ్రో' మూవీ టీజర్ రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ మీద భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సాయి, తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'బ్రో' సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా అదిరిపోయింది.

అయినా త్రివిక్రమ్ పై ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయంటే? అందుకు కారణం మన బుట్ట బొమ్మ పూజ హెగ్డే అని అంటున్నారు. 'బ్రో' టీజర్ కు ముందు పూజా హెగ్డే నటించిన ఓ కమర్షియల్ యాడ్ ఇప్పుడు నెటిజన్ల కంటపడింది. దాంతో పూజ హెగ్డే లేనిదే గురూజీ సినిమా చేసేలా లేరుగా? అంటూ  త్రివిక్రమ్ ని ఆడేసుకుంటున్నారు. మరి కొంతమంది నెటిజెన్స్ అయితే ఈ యాడ్లో నటించేందుకే పూజా హెగ్డే ను మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పించి ఉంటారంటూ చెబుతున్నారు. 'బుట్ట బొమ్మను వదిలేదేలే', 'పూజ హెగ్డే లేనిది గురూజీ సినిమాలు తీయరా?', 'ఏదో విధంగా బుట్ట బొమ్మ కనిపించాల్సిందే', 'త్రివిక్రమ్ లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే' అంటూ రకరకాల కామెంట్స్ తో నెటిజెన్స్ త్రివిక్రమ్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా త్రివిక్రమ్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. కాగా త్రివిక్రమ్, పూజ హెగ్డే కాంబినేషన్లో ఇప్పటికే 'అరవింద సమేత', 'అలవైకుంఠపురంలో' వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి. దాంతో పూజ హెగ్డే త్రివిక్రమ్ కి గోల్డెన్ హీరోయిన్గా మారిపోయింది. అందుకే రీసెంట్ టైమ్స్ లో పూజ హెగ్డే వరుస ప్లాప్స్ అందుకున్నా కూడా త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారు. కానీ ఈ మధ్య పూజా హెగ్డే మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

పూజా హెగ్డే ని తీసేసి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుకున్న శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ ఫిక్స్ గా చేశారని, అలాగే రెండవ హీరోయి‌‌న్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కాగా ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ 'బ్రో' టీజర్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తమిళ నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాని తెరకెక్కించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ తెరకెక్కింది. జూలై 28న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాని జి స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

Also Read : కోలీవుడ్ స్టార్ ధనుష్ పై నిషేధం? నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget