అన్వేషించండి

కోలీవుడ్ స్టార్ ధనుష్ పై నిషేధం? నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం?

తమిళ అగ్ర హీరో ధనుష్ కి ఓ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. తమిళ నిర్మాత మండలి అతనిపై నిషేధం విధించనున్నట్లు సమాచారం.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి భారీ షాక్ తగిలింది. తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్ రీసెంట్ గా  'సార్' సినిమాతో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్నాడు. ఇక అటు బాలీవుడ్ లోనూ ధనుష్ స్ట్రైట్ మూవీస్ తో బిజీగా ఉన్నాడు. అలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ కోలీవుడ్ హీరో కి ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. తమిళ నిర్మాత మండలి(TFPC) తాజాగా ధనుష్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ధనుష్ తో పాటు అతని సినిమాలపై కూడా నిషేధం విధించడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

ఇంతకీ అసలు ఏమైంది? ఈ రెడ్ కార్ట్ అంటే ఏంటి? అనే వివరాల్లోకి వెళితే.. తమిళ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల నుంచి హీరోగా కొనసాగుతున్నాడు ధనుష్. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కాగా గతంలో శ్రీ తేండ్రల్ ఫిలిమ్స్ నిర్మాణంలో ధనుష్ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అయితే ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటివరకు సినిమా మాత్రం చేయట్లేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిని(TFPC) ఆశ్రయించింది. ధనుష్ సినిమా చేయకుండా ఆలస్యం చేస్తున్నందుకుగాను అతనికి నోటీసులు ఇవ్వాలని తమిళ నిర్మాతల మండలి(TFPC) అనుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ధనుష్ నుంచి సరైన సమాధానం రాకపోతే.. బ్యాన్ విధించే అవకాశాలున్నాయి.

అయితే ధనుష్ లాగానే తమిళ ఇండస్ట్రీలో మరికొంతమంది నటీనటులకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్సులు తీసుకుని సినిమా చేయడం లేదనే రీజన్ తో తమిళ హీరోలు శింబు, విశాల్, ఎస్ జె సూర్య, అథర్వ తో పాటూ కమెడియన్ యోగి బాబుకి కూడా తమిళ నిర్మాతల మండలి నోటీసులు ఇవ్వనుందనే సమాచారం బయటికి వచ్చింది. ఒకవేళ నోటీసులు జారీ చేస్తే ఏ దర్శక, నిర్మాతలు వీళ్ళతో సినిమా చేయడం కుదరదు. అంటే ఒక రకంగా వీళ్ళపై నిషేధం విధించినట్లే. గతంలో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో ఇలాంటి వివాదం కారణంగానే కమెడియన్ వడివేలు కొన్ని సంవత్సరాలపాటు సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు అదే పరిస్థితి ధనుష్ కి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే ధనుష్ ఫ్యాన్స్ కి ఇది షాక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. కాగా ధనుష్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది తెలుగులో 'సార్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేస్తున్నారు.ఈ ప్రాజెక్టుతోపాటు తమిళంలో 'కెప్టెన్ మిల్లర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ధనుష్ ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాని మూడు భాగాల ఫ్రాంచీగా తీస్తున్నారు. ఈ ఏడాదిలోనే మొదటి భాగం విడుదల కానుంది. మరోపక్క కొద్ది రోజుల కింద బాలీవుడ్ లోనూ ఓ సినిమాకి కమిట్ అయ్యారు. బాలీవుడ్లో ధనుష్ కి రాంజనా, అతరంగి రే వంటి హిట్స్ అందించిన ఆనంద్. ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.

Also Read : రామ్ - బోయపాటి మూవీ అఫీషియల్ టైటిల్ కు ముహూర్తం ఫిక్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Best Annual Prepaid Plans: ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Embed widget