అన్వేషించండి

Yash: 'కేజీఎఫ్' హీరో యశ్ బర్త్ డే వేడుకల్లో అపశృతి - ముగ్గురు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం

Yash : కన్నడ హీరో యష్ బర్త్ డే వేడుకలు అపశృతి చోటుచేసుకుంది. ఎయశ్స్ బర్త్డే బ్యానర్ కడుతుండగా ఎలక్ట్రిక్ షాప్ తో ముగ్గురు అభిమానులు మృతి చెందారు.

KGF Hero Yash Birthday : 'కేజిఎఫ్' సినిమాతో పాన్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో యశ్ ఈరోజు తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన బర్త్ డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ లో అపశృతి చోటు చేసుకుంది. ముగ్గురు అభిమానులు ఎలక్ట్రిక్ షాక్ కి గురై మృతి చెందారు. ఈ వార్త కాస్త కన్నడ నాట కలకలం రేపింది. యశ్ పుట్టినరోజు సందర్భంగా సురంగి అనే గ్రామానికి చెందిన యశ్ అభిమానులు ముగ్గురు ఆదివారం రాత్రి  బర్త్ డే బ్యానర్స్ ఏర్పాటు చేస్తున్నారు. బ్యానర్ కడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ షాక్ కి గురయ్యారు.

ఈ ఘటనలో హనుమంత మజ్జురప్ప, హరిజన్ మురళి, నీలప్ప నిడివి మనీ అనే ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురికి కూడా షాక్ తగలగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వాళ్లను ఐసీఏలో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. 25 అడుగుల ఎత్తులో బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

కన్నడలో సీరియల్ నటుడిగా కెరీర్ ని ప్రారంభించిన యశ్ 2007లో 'జంబాడ హుడిగి' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరస విజయాలు అందుకుని కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా స్థిరపడ్డారు. 2018లో వచ్చిన 'కేజీఎఫ్ 1', 2022లో వచ్చిన 'కేజీఎఫ్​ 2' సినిమాలు యశ్​ కెరీర్​లో బ్లాక్​ బస్టర్​ హిట్స్​గా నిలిచాయి. దీంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

యశ్ ఈ మధ్యే తన కొత్త సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. యశ్ కెరియర్ లో 19వ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రానికి 'టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్' అనే వెరైటీ టైటిల్ ని ఫిక్స్ చేశారు. గీత మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ని మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాతోనే కరీనాకపూర్ సౌత్ లోకి ఆరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

గ్లోబల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో తలకెక్కనున్న ఈ సినిమాలో ఎస్ క్యారెక్టర్లేజేషన్ గ్రే షేడ్స్ ని కలిగి ఉంటుందట సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు ప్రధాన పాత్రలు ఉండడంతో ఆ పాత్రల కోసం కరీనాకపూర్, శృతిహాసన్, సాయి పల్లవి లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాని శ్రీలంక, గోవా, లండన్ లాంటి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Also Read :ఎంగేజ్‌మెంట్‌కు సిద్ధమవుతున్న విజయ్, రష్మిక? త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget