Vijay Rashmika: ఎంగేజ్‌మెంట్‌కు సిద్ధమవుతున్న విజయ్, రష్మిక? త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్?
Vijay and Rashmika Engagement: విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారని వార్తలు వైరల్ అవుతుండగా వీరి రిలేషన్ గురించి అనౌన్స్ చేస్తారని, ఎంగేజ్‌మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నారని కొత్తగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
Vijay and Rashmika Engagement: ఆన్ స్క్రీన్‌పై హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే చాలు.. వారు ఆఫ్ స్క్రీన్‌లో కూడా కపులే అని ప్రేక్షకులు రూమర్స్ క్రియేట్ చేస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అలా హాట్ టాపిక్ కపుల్‌గా ఉన్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందనా. అసలు వీరిద్దరు నిజంగా లవ్‌లో ఉన్నారా లేదా ప్రేక్షకులే అలా అనుకుంటున్నారా అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ చాలా సందర్భాల్లో వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్‌లో కూడా కపులే అని అనుమానం వచ్చేలా ప్రవర్తించారు. ఇక ఇన్నాళ్ల తర్వాత వీరి రిలేషన్‌షిప్‌ను అఫీషియల్ చేయాలని విజయ్, రష్మిక నిర్ణయించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌పై కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం.
రిలేషన్‌ఫిప్‌పై క్లారిటీ..
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విజయ్, రష్మిక పోస్టులు చూస్తుంటే వీరిద్దరూ లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి ఒక్క ఫోటో కూడా పోస్ట్ చేయడం లేదు. కానీ వీరిద్దరూ విడివిడిగా పోస్ట్ చేస్తున్న ఫోటోలకు మాత్రం ఒకటే బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. అంతే కాకుండా ‘యానిమల్’ ప్రమోషన్స్ సమయంలో విజయ్, రష్మిక రిలేషన్‌లో ఉన్నారన్న విషయాన్ని దాదాపుగా కన్ఫర్మ్ చేశాడు రణబీర్. దీంతో ఫ్యాన్స్ అంతా విజయ్, రష్మిక కలిసి ఎప్పుడు ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటిస్తారా అని ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇక త్వరలోనే వీరి రిలేషన్‌షిప్ గురించి అఫీషియల్‌గా ప్రకటించడంతో పాటు ఎంగేజ్‌మెంట్ కూడా క్లారిటీ ఇస్తారని రూమర్స్ వైరల్ అయ్యాయి.
వచ్చే నెలలో..
ఫిబ్రవరీ రెండో వారంలో విజయ్, రష్మికల ఎంగేజ్‌మెంట్ ఉంటుందని, దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను వీరిద్దరూ కలిసి చేస్తారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వాలెంటైన్స్ డే సమయంలోనే వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్‌తో ఒక్కటి అవ్వాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ రూమర్స్ విని విజయ్, రష్మిక మ్యూచువల్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. చాలాకాలం తర్వాత వీరి రిలేషన్ గురించి అనౌన్స్ చేయడానికి వీరే స్వయంగా ముందుకు వస్తారు అనే ఆలోచన అందరినీ ఎగ్జైట్ చేస్తోంది. ఇప్పటికే రెండు సక్సెస్‌ఫుల్ సినిమాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్, రష్మిక.. మళ్లీ ఆన్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు కలిసి నటిస్తారా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ ఎంగేజ్‌మెంట్ న్యూస్ సర్‌ప్రైజ్‌లాగా ఎదురయ్యింది.
రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్..
ఇకపోతే రష్మిక హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందే తనకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. కన్నడలో ‘కిర్రిక్ పార్టీ’ మూవీతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక.. ఆ తర్వాత అదే మూవీలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టిని ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. వీరిద్దరి నిశ్చితార్థం చాలా గ్రాండ్‌గా జరిగింది. అప్పుడే రష్మికకు హీరోయిన్‌గా తెలుగు నుండి ఆఫర్లు రావడం మొదలయ్యింది. దీంతో రక్షిత్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను బ్రేక్ చేసుకొని టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది. ‘గీతా గోవిందం’లో కలిసి నటించిన విజయ్‌తో రష్మిక ప్రేమలో పడిందని కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు వీరి ఎంగేజ్‌మెంట్ రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: చిక్కుల్లో ‘అన్నపూర్ణి’ మూవీ - నయనతారపై కేసు నమోదు