అన్వేషించండి

Sreeleela-Tillu Square: 'టిల్లు స్క్వేర్‌' లిల్లీకి ఫస్ట్‌ ఛాయిస్‌ అనుపమ కాదా! శ్రీలీలా? - అయ్యే గోల్డెన్‌ చాన్స్‌ మిస్‌ చేసుకుందే..

Sreeleela: టిల్లు స్క్రేర్‌' ఇంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన నేపథ్యంలో టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది.  అసలు విషయం తెలిసి అయ్యే గోల్డెన్ చాన్స్ మిస్సయిందే అంటున్నారు.

Sreeleela Walked Out From Tillu Square Movie: 'టిల్లు స్కేర్‌' మూవీ విడుదలైంది.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. మార్చి 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దుమ్మురేపుతుంది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి పాటిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే(ఫస్ట్‌ వీకెండ్‌) రూ. 68 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి మేకర్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. రెండో వీక్‌లోనూ అదే రోజు చూపిస్తున్న ఈ చిత్రం మెల్లిమెల్లిగా వందకోట్ల గ్రాస్‌ వైపు పరుగులు తీస్తుంది. డీజే టిల్లు మించి ఈ మూవీ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ను అందుకుంది. విడులైన మ్యాట్నీ షోతోనే మూవీ టీం సక్సెస్ మీట్‌ను జరుపుకుందంటే మూవీ ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

'టిల్లు స్క్రేర్‌' ఇంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన నేపథ్యంలో టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది.  అసలు విషయం తెలిసి అయ్యే గోల్డెన్ చాన్స్ మిస్సయిందే అంటున్నారు. కాగా  ఈ  సినిమాలో అనుపమ లిల్లీగా బోల్డ్‌ రోల్ తో తన ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. విడుదలకు ముందు దారుణమైన ట్రోల్స్‌ ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు అందరి చేత వావ్ అనిపించుకుంటుంది. నెగిటివ్‌ రోల్లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.  దీంతో శ్రీలీల గోల్డెన్‌ చాన్స్‌ మిస్‌ అయ్యిందంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్‌ రోల్‌కి అనుపమ కంటే ముందు శ్రీలీలే పస్ట్‌ ఛాయిస్‌ అట. ఈ విషయం చాలా మందికి తెలియదు. 'టిల్లు స్క్వేర్‌'కి ఫస్ట్‌ హీరోయిన్‌గా శ్రీలీలను అనుకున్నారట. ఆమె కూడా ఓకే చెప్పి సెట్‌లోనూ అడుగుపెట్టింది. శ్రీలీలతో కొన్ని షూట్స్‌ కూడా జరిగాయట. ఇక తన రోల్లో బోల్డ్‌నెస్‌ ఎక్కువ ఉండటంతో చేయనని చెప్పి షూటింగ్‌ మధ్యలో నుంచి వెళ్లిపోయిందట.

దాంతో ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్‌ తీస్తున్నారట. కానీ, లిల్లీ పాత్రలో మాత్రం అనుపమ చాలా అద్భుతంగా నటించింది. నెగిటివ్‌ రోల్‌ అండ్‌ బోల్డ్‌నెస్‌ ఆమెకు పర్ఫెక్ట్‌ ఆప్ట్‌ అయ్యింది. అదే శ్రీలీల చేసుంటే ఆమె ఈ పాత్ర అంతగా న్యాయం చేసుండేది కాదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ ఉన్న ఆమెకు లిల్లీ పాత్ర తన కెరీర్‌కు డ్యామేజ్‌ అయ్యేది. సినిమాల్లో ట్రెడీషనల్‌ లుక్‌, గ్లామరస్‌ రోల్స్‌తో ఆకట్టుకుంటున్న ఆమె ఈ మధ్యే తన డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది. అన్నింటిలో పక్కటి అమ్మాయిలా కనిపించిన ఆమె 'టిల్లు స్క్వేర్‌'లో లిల్లి పాత్రకు తన ఇమేజ్‌ సూట్‌ అయ్యిండేది కాదు.. ఒకవేళ  ఈ పాత్ర ఆమె చేసుంటే ఈ రేంజ్‌లో రెస్సాన్స్‌ వచ్చేది కాదేమో.. కాబట్టి శ్రీలీలా ఈ సినిమా నుంచి తప్పుకుని మంచి పనిచేసిందంటున్నారు.

అయితే అనుపమ కూడా అప్పటి వరకు ట్రెడీషనల్‌ బ్యూటీ ట్యాగ్‌ ఉన్న ఆమెకు చాలా గ్యాప్‌ తర్వాత ఈ సినిమా చేసింది. ఎందుకంటే ప్రస్తుతం అనుపమకు పెద్దగా ఆఫర్స్‌ లేవు.. కాబట్టి ఇప్పుడు తనని తను మేకోవర్‌ చేసుకున్న అనుపమకు టిల్లు స్క్వేర్‌లో లిల్లీ పాత్ర ఆమెకు ప్లస్‌ అయ్యింది ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాగా చివరిగా 'గుంటూరు కారం' చిత్రంలో కనిపించిన శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు కాస్తా బ్రేక్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ఎంబీబీఎస్‌ ఎక్సామ్స్‌కి ప్రీపెర్‌ అవుతుంది ఈ బ్యూటీ. 'గుంటూరు కారం' తర్వాత మరే సినిమాకు సంతకం చేయలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సినిమా మాత్రమే ఉంది. పవన్‌ కళ్యాణ్‌ జంటగా నటించిన ఈ మూవీ ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది.  

Also Read: ఆ కారణంతోనే చిరంజీవి మూవీ ఆఫర్‌ వదులుకున్నా - నా ఆల్‌టైం ఫేవరేట్‌ హీరో వెంకటేష్‌ గారు..

టాప్ హెడ్ లైన్స్

Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Rajamouli Reaction : రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
Niharika Konidela : పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget