Shivam Bhaje: భక్తులకు పూనకాలు తెప్పించేలా 'రం రం ఈశ్వరం'... 'శివం భజే'లో తొలి పాట విన్నారా?
Ram Ram Eeswaram: అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన 'శివం భజే' సినిమాలో తొలి పాట 'రం రం ఈశ్వరం'ను సంగీత దర్శకుడు తమన్ రిలీజ్ చేశారు.
శివనామస్మరణ తెలుగు సినిమాకు ఎప్పుడూ విజయాలు అందించింది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ' అందుకు రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ పరమ శివుని నేపథ్యంలో మరొక తెలుగు సినిమా 'శివం భజే' వస్తోంది. అందులో అశ్విన్ బాబు కథానాయకుడు. అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. ఈ సినిమాలో తొలి పాట 'రం రం ఈశ్వరం'ను లేటెస్టుగా విడుదల చేశారు.
ఈ పాట వింటే శివ భక్తులకు పూనకాలే...
తమన్ చేతుల మీదుగా 'రం రం ఈశ్వరం'
''రం రం ఈశ్వరం...
హం పరమేశ్వరం
యం యం కింకరం
గం గం గంగాధరం
భం భం భైరవం
ఓం ఓం కారవం
లం మూలాధారం
శంభో శంకరం''అంటూ 'శివం భజే' సినిమాలో తొలి పాట మొదలు అయ్యింది. దీనికి వికాస్ బడిస సంగీతం అందించగా.... సాయి చరణ్ భాస్కరుని ఆలపించారు. ప్రతి శివ భక్తుడు పాడుకునేలా శివ స్తుతితో పూర్ణ చారి చక్కటి సాహిత్యం అందించారు. ఈ పాట వింటే భక్తులతో పాటు ప్రేక్షకులకు సైతం పూనకాలు రావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. గూస్ బంప్స్ తెప్పించేలా ఉందీ పాట.
Also Read: డార్లింగ్ ఫస్ట్ రివ్యూ... నభాతో ప్రియదర్శి పెళ్లి కష్టాలు, ఆ కామెడీ సీన్లు ఎలా ఉన్నాయంటే?
కనిపించేదంతా మున్నేత్రుడి మర్మమే 🔱
— thaman S (@MusicThaman) July 18, 2024
Walk into his divine trance with #RamRamEeswaram 💥#Shivambhaje from August 1st in theatres 🕉
▶️ https://t.co/WNVE3hgrQP@imashwinbabu @DiganganaS @arbaazSkhan @apsardirector @MaheswaraMooli @vikasbadisa @Dsivendra @ChotaKPrasad @sahisuresh…
My best wishes to my dear partner in 🏏 dearest @imashwinbabu for #ShivamBhajeOnAUG1st #ShivamBhaje is goona make the best for our star Batsman 🏏🏆 Win it Buddy ❤️
— thaman S (@MusicThaman) July 18, 2024
Also wishing my dear Composer @vikasbadisa brother ❤️ super best ✨
Good luck guys 🩵 pic.twitter.com/CRWejqwekP
కథలో కీలకమైన ఘట్టంలో ఈ 'రం రం ఈశ్వరం...' సాంగ్ వస్తుందని, విడుదలైన కొన్ని క్షణాల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఆగస్టు 1న చిత్రాన్ని విడుదల చేస్తాం. 'రం రం ఈశ్వరం' విడుదల చేసిన తమన్ గారికి థాంక్స్. ఈ పాట వింటూ ఉంటే తెలియకుండా శివ ధ్యానంలో వెళ్లిన తన్మయత్వ అనుభూతికి లోను అయ్యామని కొందరు చెప్పడం చాలా సంతోషం కలిగించింది. వికాస్ బడిస నేపథ్య సంగీతం, పాటలు 'శివం భజే'కి పెద్ద బలం. హీరో అశ్విన్ బాబు నటన మరింత బలం అయ్యింది. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు. న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ 'శివం భజే' అని చిత్ర దర్శకుడు అప్సర్ తెలిపారు.
అశ్విన్ బాబు సరసన యువ కథానాయిక దిగంగనా సూర్యవంశీ నటించిన ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్ విలన్. 'హైపర్' ఆది, మురళీ శర్మ, సాయి ధీనా, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, 'షకలక' శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనాయ సుల్తానా ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, సంగీతం: వికాస్ బడిస, ఫైట్ మాస్టర్: పృథ్వీ - రామకృష్ణ, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి, దర్శకత్వం: అప్సర్.