అన్వేషించండి

Pekamedalu First Review: పేకమేడలు ఫస్ట్ రివ్యూ... మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ప్లస్ ఫుల్ కామెడీ!

Peka Medalu Movie Review: 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే నిర్మించిన సినిమా 'పేక మేడలు'. జూలై 19న రిలీజ్ అవుతోంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? ఆల్రెడీ మూవీ చూసినవాళ్లు ఏమంటున్నారు? ఫస్ట్ రివ్యూ చూడండి.

Peka Medalu Movie Review Telugu: 'నా పేరు శివ', 'అంధగారం' ఫేమ్ వినోద్ కిషన్ కథానాయకుడిగా నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా 'పేకమేడలు'. 'బాహుబలి'తో నటుడిగా, 'ఎవరికీ చెప్పొద్దు'తో కథానాయకుడిగా విజయాలు అందుకున్న రాకేష్ వర్రే నిర్మించారు. ఇందులో అనూషా కృష్ణ హీరోయిన్. ప్రచార చిత్రాలకు తోడు రానా దగ్గుబాటి, విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వల్ల సినిమాకు క్రేజ్ పెరిగింది. జూలై 19న... అంటే ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ కొంత మంది సినిమా చూశారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి? సినిమా ఎలా ఉంది? అనేది ఫస్ట్ రివ్యూ చూసి తెలుసుకోండి. 

పల్లెటూరి భార్య... సాఫ్ట్‌వేర్ భర్త!
Vinod Kishan Role In Pekamedalu Movie: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువకుడిగా 'పేక మేడలు' సినిమాలో వినోద్ కిషన్ కనిపించనున్నారు. పల్లెటూరి అమ్మాయితో ఆయనకు పెళ్లి జరుగుతుంది. ఆ భార్య క్యారెక్టర్ అనూషా కృష్ణ చేశారు. సిటీలో ఈ జంట మధ్య ఏం జరిగింది? ఉద్యోగం మానేసి వినోద్ కిషన్ ఏం చేశాడు? భార్య పేరు మీద అప్పులు చేసినట్టు ట్రైలర్‌లో చూపించారు. ఆ అప్పులు ఎందుకు చేశాడు? భార్య భర్తల మధ్య వచ్చిన ఎన్నారై లేడీ ఎవరు? ఆమెకు, హీరోకి మధ్య కనెక్షన్ ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ప్లస్ కామెడీ!
Pekamedalu Movie First Review: 'పేక మేడలు' చిత్రానికి నీలగిరి మామిళ్ల దర్శకుడు. ఆయన మిడిల్ క్లాస్ ఎమోషన్స్, ఆడియన్స్ పల్స్ బాగా పట్టుకున్నారని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు.

వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి రియల్ ఎస్టేట్ గట్రా అంటూ భర్త బాధ్యతలు విస్మరించినప్పటికీ... కుటుంబ పోషణ కోసం భార్య ఏదో ఒక పని చేయడం, చివరకు కర్రీ పాయింట్ పెట్టుకోవడం వంటి సన్నివేశాలు సగటు మధ్య తరగతి మనుషులు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని, 'పేక మేడలు'లో కొన్ని సన్నివేశాలు చూసి ఆడియన్స్ కంటతడి పెడతారని పెయిడ్ ప్రీమియర్లు, ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు.

Also Readబన్నీ వర్సెస్ సుకుమార్ - గొడవలతో 'పుష్ప 2' షూటింగ్ మళ్లీ వాయిదా?

ఎమోషన్స్, సెంటిమెంట్ సీన్లు మాత్రమే సినిమాలో ఉన్నాయని అనుకోవద్దు. ఈ 'పేక మేడలు'లో కామెడీ సైతం కిర్రాక్ అనేలా ఉందట. ఈజీ మనీ కోసం, అతి తక్కువ సమయంలో కోటీశ్వరుడు కావడం కోసం హీరో చేసే పనులు కడుపుబ్బా నవ్విస్తాయని సమాచారం. అదీ సంగతి.

అదీ 'పేక మేడలు' టైటిల్ వెనుక మీనింగ్!
'పేక మేడలు' టైటిల్ కూడా ఏదో అల్లాటప్పాగా పెట్టలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే హీరో అది మానేసి రియల్ ఎస్టేట్ అంటూ తిరుగుతాడు. మేడలు అంటే బిల్డింగ్స్ కదా! మరి, ఆ మేడలకు ముందు పేక ఎందుకు వచ్చింది? అనేది మూవీ లవర్స్ సినిమా చూస్తే తెలుస్తుంది. ఎమోషనల్ మూమెంట్స్ అండ్ సెంటిమెంట్ కూడా యాడ్ అయ్యి ఉంది. రాకేష్ వర్రే ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ అంటున్నారు. ఖర్చు విషయంలో ఆయన రాజీ పడకుండా సినిమా తీశారని 'పేక మేడలు' చూసిన జనాలు చెబుతున్నారు.

Also Readశేఖర్ మాస్టర్ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నాడు - అమ్మాయిలతో పులిహోర కలిపేస్తున్నాడు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget