అన్వేషించండి

Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం

బిహార్ కు చెందిన యువ చిచ్చిర పిడుగు వైభవ్ సూర్యవంశీ తాజాగా మరోసారి రికార్డులకెక్కాడు. 13 ఏళ్ల వయసులోనే వన్డే మ్యాచ్ ఆడిన భారతీయుడిగా ఘనత సాధించాడు. 

Vaibhav Suryavanshi Latest Updates: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా మరొక ఘనత తన ఖాతాలో చేరింది. లిస్టు-ఏ క్రికెట్ ఆడిన భారత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్ తోజరిగిన మ్యాచ్ లో వైభవ్ బరిలోకి దిగాడు. 13 ఏళ్ల 269 రోజుల సూర్యవంశీ తాజాగా ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు విదర్భకు చెందిన అలీ అక్బర్ పేరిట ఉండేది. తను 1999- 2000 మధ్య 14 ఏళ్ల వయసులో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తాజాగా 25 ఏళ్ల రికార్డును వైభవ్ కొల్ల గొట్టినట్లు అయింది. 

ఆకట్టుకోలేక పోయిన సూర్యవంశీ..
అయితే ఈ మ్యాచ్ లో వైభవ్ అంతగా ఆకట్టుకోలేక పోయాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన వైభవ్.. నాలుగు పరుగులతో వెనుదిరిగాడు. అంటే తొలి బంతికి బౌండరీ బాదిన ఈ చిచ్చర పిడుగు.. మలి బంతికే పెవిలియ్ కు చేరాడు. అయితే ఈ మ్యాచ్ లో బిహార్ ఆరు వికెట్లతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ 47 ఓవర్లలో 196 పరుగులు చేసింది. అయితే మధ్యప్రదేశ్ ఈ టార్గెట్ ను సునాయాసంగా అధిగమించింది. హరిష్ గావ్లీ (83), కెప్టెన్ రజత్ పాటిదార్ (53) అర్థ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో మరో 146 బంతులు మిగిలి ఉండగానే ఎంపీ గెలుపును అందుకుంది. 

Also Read: U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు

ఐపీఎల్లో రాజస్థాన్ తరపున..
గతనెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్ల రూపాయలకు వైభవ్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ లో ఆడబోతున్న అతిపిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు నెలకొల్ప బోతున్నాడు. మరోవైపు రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నాయకత్వంతో ఐపీఎల్లో ఆడనుండటం చాలా ఆనందంగా ఉందని వైభవ్ పేర్కొన్నాడు. లెజెండ్ అయినటువంటి ద్రవిడ్ సారథ్యంలో తన ఆటకు మరింత మెరుగులు దిద్దుకుంటానని పేర్కొన్నాడు. ఐపీఎల్ కు సంబంధించి ప్రణాళికలు ఏమీ రచించుకలేదని, తన సహజ ఆటతీరును ఆడతానని పేర్కొన్నాడు. ముఖ్యంగా తొలి సారి ఆడబోతున్న ఐపీఎల్ ను ఆస్వాదిస్తానని వెల్లడించాడు.  ఇక గతనెలలో జరిగిన అండర్-19  ఆసియాకప్ లో కూడా వైభవ్ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో 44 సగటుతో 145కి పైగా స్ట్రైక్ రేటుతో 176 పరుగులు సాధించాడు. దీంతో టోర్నీలో రెండో లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో యూఏఈ, శ్రీలంకపై రెండు అర్థ సెంచరీలు కూడా సాధించడం విశేషం.

Also Read: Rohit Sharma Injured: టీమిండియాకు బిగ్ షాక్- ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన రోహిత్.. అతడి పరిస్థితి ఎలా ఉందంటే..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Fact Check :తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
Embed widget