Arjun Ambati: శేఖర్ మాస్టర్ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నాడు - అమ్మాయిలతో పులిహోర కలిపేస్తున్నాడు!
Sekhar Master: శేఖర్ మాస్టర్ మీద 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షో స్టార్ట్ అయినప్పటి నుంచి అర్జున్ అంబటి సెటైర్స్ వేస్తున్నాడు. లేటెస్ట్ ప్రోమోలోనూ భారీ సెటైర్ వేశాడు.
Kiraak Boys Khiladi Girls Latest Promo: 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ శని, ఆది వారాల్లో (జూలై 20, 21 తేదీల్లో) టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ కుకింగ్ థీమ్ బేస్ చేసుకుని చేశారు. ఆ రెండు రోజుల్లో ఏం చెయ్యబోతున్నారో? ఎటువంటి వినోదం అందించబోతున్నారో? శాంపిల్ చూపించారు. ప్రోమో అంతా ఒక ఎత్తు అయితే... శేఖర్ మాస్టర్ మీద అర్జున్ అంబటి వేసిన పంచ్ డైలాగ్స్ మరొక ఎత్తు.
శేఖర్ మాస్టర్ పులిహోర రాజానా?
'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' లేటెస్ట్ ప్రోమో చూస్తే... ఫేమస్ డ్యాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్ పెద్ద పులిహోర రాజా ఏమో అని డౌట్ కలుగుతుంది. ఈ షో స్టార్ట్ అయిన లాంచ్ ఎపిసోడ్ నుంచి శేఖర్ మాస్టర్ మీద అర్జున్ అంబటి పంచ్ డైలాగ్స్ వేస్తూ ఉన్నాడు.
శేఖర్ మాస్టర్ అడిగితే ఏ అమ్మాయి అయినా సరే నంబర్ ఇస్తుందని ఆ మధ్య ఒక సందర్భంలో, షోలోనే చెప్పాడు. మరొకసారి ఆయన అమ్మాయిలకు ఫేవర్ అని చెప్పాడు. లేటెస్ట్ ప్రోమోలో శేఖర్ మాస్టర్ పులిహోర కలిపే ఛాన్స్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చాడు.
కుకింగ్ బేస్డ్ థీమ్ ఎపిసోడ్ కనుక కిరాక్ బాయ్స్ అందరూ వంట సామానుతో స్టేజి మీద వచ్చారు. 'హోటల్ స్టాఫ్ అని పిలిస్తే టెంట్ హౌస్ వాళ్ళు వచ్చారు' అని యాంకర్ శ్రీముఖి పంచ్ వేసింది. ఆ తర్వాత ''ఈయన మాత్రం పులిహోర బాగా కలుపుతాడు అని విన్నాను'' అని అర్జున్ అంబటిని చూపిస్తూ చెప్పింది శ్రీముఖి. అందుకు బదులుగా ''మాకు ఛాన్స్ ఇస్తున్నాడా? ఆయనే మొత్తం కలిపేస్తున్నాడు'' అని శేఖర్ మాస్టర్ వైపు వేలు చూపించాడు. దాంతో మాస్టర్ ఒక్కసారి అవాక్ అయ్యాడు. ఆయన పక్కన ఉన్న అనసూయ సైతం కామెడీ చేసే ప్రయత్నం చేసింది.
Also Read: బన్నీ వర్సెస్ సుకుమార్ - గొడవలతో 'పుష్ప 2' షూటింగ్ మళ్లీ వాయిదా?
🎉 Get ready for an exciting week on #KiraakBoysKhiladiGirls with a special "Cooking Theme"! Watch thrilling challenges and fun competitions along with Sekhar Master and Anasuya, the fun and excitement are guaranteed! Tune in every Sat & Sun at 9 PM, only on #StarMaa! 🌟 #KBKG pic.twitter.com/82ULwpM7BX
— Starmaa (@StarMaa) July 16, 2024
కామెడీ కోసం శేఖర్ మాస్టర్ భరించాలి!
స్టార్ హీరో సినిమా అంటే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ఒక్కటి అయినా కంపల్సరీగా ఉండాలి. రీసెంట్ మాస్ మహారాజా రవితేజ సినిమా 'మిస్టర్ బచ్చన్'లో 'సితార్...' సాంగ్ చేసింది కూడా ఆయనే. ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ... రియాలిటీ షోలకు కూడా టైమ్ అడ్జస్ట్ చేస్తారు శేఖర్ మాస్టర్. ఈ షోలు చూసే జనాలను నవ్వించడం కోసం ఇటువంటి పంచ్ డైలాగ్స్ కూడా ఆయన భరించాలి.