అన్వేషించండి

Pushpa The Rule: బన్నీ వర్సెస్ సుకుమార్ - గొడవలతో 'పుష్ప 2' షూటింగ్ మళ్లీ వాయిదా?

Allu Arjun New Look: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల టాక్. అల్లు అర్జున్ గడ్డం తీసేసిన న్యూ లుక్ కూడా వైరల్ అవుతోంది.

Allu Arjun Vs Sukumar: 'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? అంటే... 'అవును' అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినబడుతోంది. ఆగస్టు 15న పాన్ ఇండియా రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడటం వెనుక షూటింగ్ చెయ్యడానికి మరింత సమయం కావాలని సుకుమార్ కోరడమే అని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. సినిమా వాయిదా వేసినప్పటికీ... షూటింగ్ సక్రమంగా జరగడం లేదని, దర్శకుడి తీరు మీద బన్నీ గుర్రుగా ఉన్నారని టాక్. 

ఫ్యామిలీతో యూరప్ వెళ్లిన అల్లు అర్జున్!
Allu Arjun has trimmed his beard: సుకుమార్ శైలి నచ్చని అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. యూరప్ వెళ్లారని టాక్. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తే... బన్నీ గడ్డం తీసేశారు. పుష్పరాజ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది 'తగ్గేదే లే' అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టుకుని చేసే మ్యానరిజమ్. ఇప్పుడు బన్నీ గడ్డం తీసేస్తే వెంటనే షూటింగ్ చెయ్యడం ఎలా సాధ్యం? అనే క్వశ్చన్ వస్తుంది.

Also Read: 25 ఏళ్ల అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ రొమాన్స్ - మిస్టర్ బచ్చన్ సాంగ్ ట్రోలర్‌కు ఇచ్చి పారేసిన హరీష్ శంకర్

అమెరికాలో సుకుమార్, ఇవాళో రేపో రాక!
ప్రజెంట్ సుకుమార్ కూడా ఇండియాలో లేరు. అమెరికా నుంచి రిటర్న్ జర్నీకి రెడీ అయ్యారు. ఆయన ఫ్యామిలీ కొన్ని రోజులుగా అక్కడ ఉంటోంది. సుక్కు వాళ్ళను చూడటానికి వెళ్లారు. ఇవాళో రేపో ఆయన ఇండియా వస్తారని టాక్. వచ్చిన తర్వాత కొత్త షెడ్యూల్ మీద వర్క్ చేస్తారట. బన్నీ నాలుగైదు రోజుల్లో ఇండియా వస్తారని, త్వరలో 'పుష్ప 2' షూట్ స్టార్ట్ చేస్తారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, అది సాధ్యమా? అనే ప్రశ్న మొదలు అవుతోంది.


గడ్డం ఎందుకు తీసేశావు పుష్ప?
సుకుమార్ మీద కోపంతో బన్నీ గడ్డం తీసేశారని ఇండస్ట్రీ గుసగుస. ఇప్పుడు మళ్ళీ గడ్డం పెరగాలి అంటే మరొక నెల అయినా పడుతుంది. అప్పటి వరకు షూటింగ్ వాయిదా వేస్తే కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ 6కి అయినా సరే రిలీజ్ అవుతుందా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మూడు యూనిట్స్ పెట్టి షూటింగ్ చేద్దామని అల్లు అర్జున్ ప్రపోజ్ చేస్తే సుకుమార్ వద్దని చెప్పారని మరొక గుసగుస. దాంతో 'పుష్ప 2' విషయంలో ఏం జరుగుతోందని ఇండస్ట్రీ సైతం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బన్నీ గడ్డం తీయడం మీద ట్రోల్స్ సైతం వస్తున్నాయి.

Also Readబికినీలో రామ్ చరణ్ హీరోయిన్ అందాల విందు... బాబోయ్ ఇప్పుడు హాట్ కంటే పెద్ద పదం వెతకలేమో, ఈ హీరోయిన్ మీకు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Diesel Vehicle Ban News:హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం
హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం 
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
Blood Pressure by Age : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Diesel Vehicle Ban News:హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం
హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం 
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
Blood Pressure by Age : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్- ట్యాంక్‌బండ్‌ ధర్నాకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్- ట్యాంక్‌బండ్‌ ధర్నాకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు
Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
Embed widget