News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mahesh Babu: మహేష్ బాబు జిమ్ టిప్స్ - ఇలా వర్కవుట్ చేయాలట!

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా జిమ్ కచ్చితంగా చేస్తారు హీరో మహేష్ బాబు. తాజాగా ఇన్ స్టా వేదికగా అభిమానులతో వర్కౌట్ టిప్స్ పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

FOLLOW US: 
Share:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ విషయంలో ఎవడి మాట వినేది లేదంటారు. ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్నా, పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్ గా కనిపిస్తారు. బాడీని మెయింటెయిన్ చేయడంలో టాలీవుడ్ లో ఆయన తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఆయను మీ ఫిట్ నెస్ సీక్రెట్  ఏంటో చెప్పండి అని అడుగుతుంటారు. సింపుల్ గా ఆయన ఓకే మాట చెప్తారు. చక్కటి పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అంటారు.

అభిమానులకు మహేష్ జిమ్ టిప్స్

ఇక తన సోషల్ మీడియా వేదికగా తరుచుగా జిమ్ లో చెమటలు చిందించే వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటారు. ఆయా ఫోటోలు, వీడియోలకు క్యాప్షన్ గా కొన్ని జిమ్ టిప్స్ కూడా చెప్తుంటారు. తాజాగా ఆయన ఓ ఫోటో షేర్ చేస్తూ అభిమానులతో కొన్ని టిప్స్ పంచుకున్నారు. సూపర్ స్ట్రెచ్ గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఈ వర్కౌట్ తో తుంటి, వెన్నెముక, భుజాలు బలంగా తయారు అవుతాయని వెల్లడించారు. అంతేకాదు, ఇదో ఔషధం లాంటి మూమెంట్ అని చెప్పుకొచ్చారు. ల్యాండ్‌మైన్‌ ప్రెస్‌,  కెటెల్‌బెల్‌ స్వింగ్స్‌,  స్కిల్‌ మిల్‌ రన్‌.. సహా రకరకాల వర్కౌట్స్  చేస్తూ మహేష్ బాబు తన ఫిట్ నెస్ కాపాడుకుంటారు. అంతేకాదు, జిమ్ లో ఉండే పరికరాలతో కనీసం ఒక్కోదానితో ఒక్క నిమిషం పాటు వర్కౌట్ చేస్తే బాడీ ఫిట్ గా ఉంటుందంటారు మహేష్ బాబు. 

View this post on Instagram
 
A post shared by Mahesh Babu (@urstrulymahesh)

వచ్చే సంక్రాంతికి ‘గుంటూరు కారం’ విడుదల

ప్రస్తుతం మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ  సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ రైటర్, దర్శకుడు త్రివిక్రమ్ తెరెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి,  శ్రీలీలహీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. జయరామ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజర్, ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్.   

మహేష్ తో సినిమా చేస్తున్న రాజమౌళి

అటు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు SS రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. #SSMB29 పేరుతో ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి. రాజమౌళి ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఈ సినిమా కథా రచయిత  KV విజయేంద్ర ప్రసాద్, ‘RRR’ను తలదన్నేలా #SSMB29 ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. యాక్షన్, థ్రిల్లర్ డ్రామాతో నిండిన అడ్వెంచర్ మూవీగా రూపొందబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Also: నటుడు నవదీప్ మెడకు డ్రగ్స్ కేసు ఉచ్చు, నోటీసులు జారీ చేసిన పోలీసులు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 15 Sep 2023 02:01 PM (IST) Tags: Mahesh Babu mahesh babu movies Mahesh Babu Gym Workouts Mahesh Babu Gym Tips

ఇవి కూడా చూడండి

Month Of Madhu: లవ్ బర్డ్స్‌కు ‘మంత్ ఆఫ్ మధు’ బంపర్ ఆఫర్ - ప్రేమికుల కోసం సీక్రెట్ స్క్రీనింగ్‌

Month Of Madhu: లవ్ బర్డ్స్‌కు ‘మంత్ ఆఫ్ మధు’ బంపర్ ఆఫర్ - ప్రేమికుల కోసం సీక్రెట్ స్క్రీనింగ్‌

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

రణ్‌బీర్, యష్ ‘రామాయణం’, రామ్‌చరణ్, ధోని మీటింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

రణ్‌బీర్, యష్ ‘రామాయణం’, రామ్‌చరణ్, ధోని మీటింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి

Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి

Hebah Patel: ఆ ప్రశ్నకు హెబ్బా పటేల్ ఆగ్రహం - ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్

Hebah Patel: ఆ ప్రశ్నకు హెబ్బా పటేల్ ఆగ్రహం - ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్

టాప్ స్టోరీస్

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే