అన్వేషించండి

G.O.A.T Glimpse: ఊర మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్.. బీజీఎమ్ తో అదరగొట్టిన లియోన్!

సుడిగాలి సుధీర్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'G.O.A.T'. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది.

'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవైపు హోస్టుగా వ్యవహరిస్తూనే, మరోవైపు పలు చిత్రాల్లో కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఈ క్రమంలో 'సాఫ్ట్‌వేర్ సుధీర్' సినిమాతో హీరోగా మారి, బిగ్ స్క్రీన్ మీద అలరిస్తున్నాడు. గతేడాది 'గాలోడు' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుధీర్ ఆనంద్.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ హీరోగా మారిపోయాడు. ఇందులో భాగంగా ‘గోట్’ అనే చిత్రంతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. 

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న 5వ సినిమా G.O.A.T (గోట్). ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (Greatest Of All Time) అనేది దీనికి ట్యాగ్ లైన్. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి ఈ మాస్ ఎంటర్‌‌టైనర్‌‌ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బ్యాచిలర్’ మూవీతో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన హాట్ బ్యూటీ దివ్య భారతి, ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా, తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

'గోట్' గ్లింప్స్ వీడియోలోకి వెళ్తే.. లుంగీ పైకి ఎగ్గట్టి ఒక చేత్తో బ్యాట్ పట్టుకొని, మరో చేత్తో సిగరెట్ తాగుతూ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు సుడిగాలి సుధీర్. “ఎవడ్రా.. నన్ను ఫ్లూక్ అన్నది” అంటూ స్టైల్ గా బ్యాట్ పట్టుకొని నిలబడగా, మూడు కార్లు వచ్చి అతని వెనుక ఆగుతాయి. ఒకే ఒక్క డైలాగ్ తో కట్ చేయబడిన ఈ వీడియోతో, ఈ సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ ఎంత మాసీగా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసారు. ఇందులో సుధీర్ లుంగీ కట్టి పక్కా మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. విశ్వక్ సేన్ ను 'పాగల్' గా చూపించిన నరేష్.. ఈసారి సుధీర్ ను కొత్త అవతారంలో ప్రెజెంట్ చేయబోతున్నాడనే క్లారిటీ వచ్చింది. 

Also Read: 'మర్మాణువు' మూవీ కోసం డైరెక్టర్ వెంకటేష్ మహా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్!

ఇక G.O.A.T టైటిల్ లో ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఫొటోలతో పాటుగా సుధీర్ ఫోటో కూడా కనిపిస్తుంది. దీన్ని ఆ దిగ్గజాల మాదిరిగానే ఈ సినిమాలో హీరో కూడా కష్టపడి పైకి వచ్చాడని చెప్పకనే చెబుతున్నారని అనుకోవచ్చు. ఈ గ్లింప్స్‌ కి మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బీజీఎం హీరో పాత్రను ఎలివేట్ చేసేలా ఉంది. మొత్తం మీద ఈ గ్లింప్స్ సుధీర్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకునేలా ఉంది.

'గోట్' చిత్రానికి ఫణి కృష్ణ కథ - మాటలు అందిస్తున్నారు. లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ పై చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మరియు బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలాజీ సుబ్రహ్మణ్యం ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యిందని నిర్మాతలు తెలిపారు. రెండు పాటలు చిత్రీకరణ పూర్తయిందని, టెక్నికల్‌గా కూడా ఉన్నతస్థాయిలో వుంటుందని.. ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీపడకుండా చాలా రిచ్‌గా నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది సుడిగాలి సుధీర్ కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా ఆశిస్తారో, అంతకుమించి ఉంటుందని పేర్కొన్నారు. 

ఇకపోతే 'సాఫ్ట్‌వేర్ సుధీర్' సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్.. ఆ తర్వాత '3 మంకీస్' 'వాంటెడ్ పండుగాడ్' వంటి చిత్రాల్లో నటించాడు. గతేడాది వచ్చిన 'గాలోడు' మూవీ రూ 5.97 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అందుకే 'G.O.A.T' సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పాటుగా 'కాలింగ్ సహస్ర' అనే చిత్రంతో సుధీర్ హీరోగా నటిస్తున్నాడు.

Also Read: 'సిరివెన్నెల చివరి పాట మా సినిమాలో ఉన్నా సరే, దాన్ని పబ్లిసిటీకి వాడుకోలేదు'

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
IPL 2025 RCB VS KKR Result Update: కోహ్లీ, సాల్ట్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీలు.. కేకేఆర్ ను బోల్తా కొట్టించిన ఆర్సీబీ.. ఫ‌స్ట్ మ్యాచ్ లో పాటిదార్ సేన‌ ఘ‌న విజ‌యం
కోహ్లీ, సాల్ట్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీలు.. కేకేఆర్ ను బోల్తా కొట్టించిన ఆర్సీబీ.. ఫ‌స్ట్ మ్యాచ్ లో పాటిదార్ సేన‌ ఘ‌న విజ‌యం
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Embed widget