Sobhita Dhulipala : పెళ్లి తర్వాత హీరోయిన్‌గా శోభిత దూళిపాళ ఫస్ట్ మూవీ - తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ 'వేట్టువం'లో డిఫరెంట్‌గా...
Sobhita Dhulipala Tamil Debut: చాలా రోజుల తర్వాత అక్కినేని కోడలు శోభిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో 'వేట్టువన్'లో ఆమె లీడ్ రోల్ చేస్తున్నారు.

Sobhita Dhuilipala Tamil Debut Movie Vettuvam: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత నటి శోభిత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నారు. అంతకు ముందు ఆమె కొన్ని మూవీస్‌లో కీలక రోల్స్ చేసినా పూర్తి స్థాయి హీరోయిన్‌గా చేయలేదు. అయితే, చాలా కాలం ఆమె హీరోయిన్‌గా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వేట్టువం' మూవీలో ఆమె లీడ్ రోల్ చేస్తున్నారు.
రోల్ ఏ విధంగా ఉంటుందో?
డైరెక్టర్ పా రంజిత్ మూవీస్ అంటేనే డిఫరెంట్‌గా ఉంటాయి. హీరో హీరోయిన్ల రోల్స్, వేషధారణ అన్నీ ఎవరూ ఊహించని విధంగా ఆయన డిజైన్ చేస్తారు. విక్రమ్ ప్రధాన పాత్ర పోషించిన 'తంగలాన్' మూవీనే అందుకు ఉదాహరణ. స్టార్ హీరో విక్రమ్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని రోల్‌లో చూపించారు రంజిత్. ఆయన కాన్సెప్ట్స్ అన్నీ కూడా కుల వ్యవస్థను నిర్మూలించే విధానంతో అణగారిన వర్గాల ఇబ్బందులను చూపించే విధంగా ఉంటాయి.
ఇక 'వేట్టువం' మూవీలో దినేశ్ హీరోగా చేస్తుండగా ఆర్య విలన్ రోల్ చేస్తున్నారు. ఇక శోభిత రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అక్కినేని కోడలు శోభిత చాలా రోజుల తర్వాత తమిళంలో హీరోయిన్‌గా ఫస్ట్ మూవీ చేస్తుండగా ఆమె రోల్ పవర్ ఫుల్‌గా ఉండనుందని ప్రచారం సాగుతోంది. శోభితకు ఇది మంచి ఛాన్స్ అని పాపులారిటీ తెచ్చే ప్రాజెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె తెలుగులో గూఢచారి, మేజర్ మూవీస్‌లో నటించి మెప్పించారు. అలాగే, మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' మూవీలో కీలక పాత్ర పోషించారు. రీసెంట్‌గా బాలీవుడ్‌లో 'జిగ్రా' మూవీ చేశారు.
నీలం ప్రొడక్షన్ బ్యానర్‌పై మూవీని నిర్మిస్తుండగా... అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్, కలైయరసన్, మైమ్ గోపి, గురు సోమసుందరం, షబీర్ కల్లరక్కల్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.





















