OG Collections: బాక్సాఫీస్ వద్ద పవన్ 'OG' రికార్డులు - 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి... వీకెండ్స్ కలెక్షన్స్ వేరే లెవల్
OG Box Office Collections Day 4: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించినట్లు మూవీ టీం తెలిపింది.

Pawan Kalyan's OG 4 Days Collections Worldwide: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రీమియర్స్, ఫస్ట్ రెండు రోజుల్లోనే రికార్డు వసూళ్లు సాధించగా వీకెండ్స్‌లో మరింత ప్రభంజనం సృష్టించింది. పవన్ కెరీర్‌లోనే తక్కువ టైంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.
4 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం వెల్లడించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 'తుఫాన్ వచ్చినప్పుడు ఆటుపోట్లకు తలొగ్గండి. OG వచ్చినప్పుడు నువ్వు పరిగెత్తి దాక్కుంటావు.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రికార్డు కలెక్షన్లతో మూవీ టీంతో పాటు పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
View this post on Instagram
టాప్ 10 ఇండియన్ సినిమాల్లో...
ఈ నెల 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రీమియర్ షోల నుంచే కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఫస్ట్ డేనే ప్రీమియర్లతో కలిపి రూ.154 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం వెల్లడించింది. తొలి రోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇక ఇండియాలో ప్రీమియర్ షోలకు రూ.21 కోట్లు, ఫస్ట్ డే (రూ.63.75 కోట్లు), రెండో రోజు రూ.19.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరగా... 4 రోజుల్లో రూ.250 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ 5 మిలియన్ డాలర్ల మార్క్ చేరువలో ఉంది.
స్పెషల్ సాంగ్...
ఈ మూవీలో బీజీఎం, పాటలు హైలైట్‌గా నిలవగా తాజాగా ఓ స్పెషల్ సాంగ్‌ను సైతం యాడ్ చేశారు. హీరోయిన్ నేహా శెట్టి ప్రత్యేక గీతంలో నటించగా... కొన్ని కారణాలతో మూవీ నుంచి ఆ పాటను తొలగించారు. అయితే, తాజాగా దాన్ని మళ్లీ యాడ్ చేస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు.
పవర్ స్టార్... పవర్ వేరే లెవల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆయన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో సిల్వర్ స్క్రీన్‌పై అలానే చూపించారు డైరెక్టర్ సుజీత్. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ 'ఓజాస్ గంభీర'గా పవన్ స్టైలిష్ లుక్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. చాలా రోజుల తర్వాత మాస్ స్టైలిష్ లుక్‌లో పవన్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ మూవీని నిర్మించారు.






















