Sudigali Sudheer: హిందీ ఒక్కటే వదిలేసిన సుడిగాలి సుధీర్ - హీరోగా పాన్ వరల్డ్ మూవీ 'హైలెస్సో' స్టార్ట్...
Hailesso Title Poster: విలేజ్ బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ మైథలాజికల్ కాన్సెప్ట్‌తో సుడిగాలి సుధీర్ కొత్త మూవీ 'హైలెస్సో' ప్రారంభమైంది. సోమవారం ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు.

Sudigali Sudheer's Hailesso Movie Pooja Ceremony: 'జబర్దస్త్' షో ద్వారా ఫుల్ ఫేం సంపాదించుకున్న కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు యంగ్ హీరో సుడిగాలి సుధీర్. తాజాగా ఆయన హీరోగా పాన్ వరల్డ్ మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. హీరో నిఖిల్ టైటిల్ పోస్టర్ ఆవిష్కరించగా... ప్రొడ్యూసర్ బన్నీ వాస్ స్క్రిప్ట్ మేకర్స్‌కు అందజేశారు. డైరెక్టర్స్ వశిష్ట, చందూ మొండేటి, మెహర్ రమేష్ కెమెరా స్విచ్చాన్ చేయగా... ఫేమస్ డైరెక్టర్ వివి వినాయక్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ బోర్డ్ ఇచ్చారు.
డిఫరెంట్ కాన్సెప్ట్... 'హైలెస్సో'
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన 'హైలెస్సో' (Hailesso) టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో మైథలాజికల్ అంశాలను టచ్ చేసినట్లు టైటిల్ పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. కాలికి ఉంగరాలు, బంగారు చీలమండలతో ఓ రాజ పాదం గంభీరంగా గ్రీన్ ఆకుపై అడుగు పెడుతుండగా హైప్ క్రియేట్ చేస్తోంది. అక్కడే సింధూరం కలిపి వండిన అన్నం, కోడి, మేక తలలు ఉండడం విలేజ్‌లో జాతర సంప్రదాయం బ్యాక్ గ్రౌండ్ అని తెలుస్తోంది. దీంతో పాటే రక్తంతో తడిసిన కత్తి ఉండడం ఆసక్తిని పెంచేసింది.
Also Read: బాయ్ కాట్ 'కాంతార చాప్టర్ 1' ట్రెండింగ్ - సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్టులు... అసలు రీజన్ ఏంటంటే?
పాన్ వరల్డ్ స్థాయిలో...
సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఇది 5వ సినిమా కాగా మూవీలో నటాషా సింగ్, నక్ష కిరణ్ హీరోయిన్లుగా నటించనున్నారు. విలన్ రోల్‌లో శివాజీ నటించనున్నారు. ప్రముఖ కన్నడ హీరోయిన్ అక్షర గౌడ కీలక పాత్రలో నటించనుంది. వీరితో పాటు మొట్టా రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెహర దువిత శరణ్య కీలక పాత్రలు పోషించనున్నారు. మూవీకి ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహించనుండగా... వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు. హిందీ తప్ప అన్నీ సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర లాంగ్వేజెస్‌లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
Hai Lesso Cast & Crew: బ్యానర్ - వజ్ర వారాహి బ్యానర్, ప్రొడ్యూసర్స్ - శివ చెర్రీ రవికిరణ్, డైరెక్టర్ - ప్రశాంత్ కుమార్ కోట, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్, DOP - సుజాత సిద్దార్థ్, ఎడిటర్ - చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి, లిరిక్స్ - రామజోగయ్య శాస్త్రి, రైటర్ - చింతా శ్రీనివాస్, కాస్ట్యూమ్ డిజైనర్ - రంజిత గువ్వల, కొరియోగ్రఫీ - విజయ్ పోలాకి, స్టంట్స్ - పృథ్వీ.





















