Kantara Chapter 1: బాయ్ కాట్ 'కాంతార చాప్టర్ 1' ట్రెండింగ్ - సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్టులు... అసలు రీజన్ ఏంటంటే?
Kantara Chapter 1 Boycott: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' బాయ్ కాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిషబ్ కన్నడలో మాట్లాడడం వివాదానికి కారణమైంది.

Rishab Shetty's Kantara Chapter 1 Boycott Trending Gone Viral: రిలీజ్‌కు రెండు రోజుల ముందు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1'కు షాక్ తగిలింది. తెలుగు నెటిజన్లు సడన్‌గా సోషల్ మీడియా వేదికగా 'బాయ్ కాట్ కాంతార చాప్టర్ 1' అంటూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడడం వివాదంగా మారింది. తెలుగు రాష్ట్రంలో తెలుగులో మాట్లాడలేదని... మన భాషను చులకన చేశారంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు. తెలుగు చిత్రాలను కర్ణాటకలో ఆడనివ్వడం లేదని... పోస్టర్లపై నల్ల రంగు పూశారని అంటున్నారు. రీసెంట్‌గా పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీకి కూడా కర్ణాటకలోని థియేటర్ల వద్ద ఇబ్బందులు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
'బాయ్ కాట్' చేయండి
గతంలో మన తెలుగు సినిమాలను కర్ణాటకలో ఆడనివ్వలేదని... కొన్ని తెలుగు సినిమా టైటిల్స్‌కు పోస్టర్స్‌లో నల్ల రంగు పూశారంటూ సదరు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. తెలుగు వారంతా ఐకమత్యంగా ఉండాల్సిన టైం వచ్చిందని మన సత్తా చూపించాలి అంటూ... 'కాంతార చాప్టర్ 1' బాయ్ కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
మన హీరోల సినిమాలను వారు చులకనగా చూస్తూ... కనీసం థియేటర్ల వద్ద పోస్టర్లు కూడా పెట్టనివ్వ లేదని అలాంటప్పుడు వారి సినిమాలను ఇక్కడ ఎందుకు ఆదరించాలని ప్రశ్నిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రిషబ్ కనీసం తెలుగులో మాట్లాడలేదని... మన భాష అంటే అంత చులకన ఏంటీ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ముఖ్య అతిథిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హాజరు కావడంపైనా విమర్శలు చేస్తున్నారు. మరి ఇది మూవీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూాడాల్సి ఉంది. మూవీ టీం సైతం రియాక్ట్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.
OG Premiers Canceled In Bangalore We Don’t Allow Kantara To Release in Telugu States 🖕
— 𝑺𝒖𝒋𝒊𝒕𝒉 𝒔𝒂𝒉𝒐𝒐 🦖 (@sujithsahoo) September 25, 2025
#BoycottKantaraChapter1 #boycottkantaraintelugustates pic.twitter.com/jeHMkKPPSs
Bangalore lo problem vachhina movies #HHVM , #OG adhi may be PK fans valla kuda anukovachhu ga... Ledhu banglore valle chesaru ante madhyalo vachhina #Athadu4K ki problem ndhuku avvaledhu.?
— శ్రీమంతుడు🧡 (@chichubabu31) September 29, 2025
తెలుగు రాష్ట్రాల్లో కన్నడ సినిమాలు చూడకండి#boycottkantarachapter1 pic.twitter.com/xw9Rp9q6aL
— JAY_PSPK (@MJayachand53176) September 29, 2025
Mana cinema lani appeyalani chusina vallu manam eppadidaka vachina kannada movie KGF kani Kantara kani manam mana movie ra support chasamu vallu mana movie lu Pushpa, Kalki ,RRR, HHVM, GC , OG eni cinema lanki strike chasaru vallu eppudu mana time vachindi #boycottkantarachapter1 pic.twitter.com/Pb8nlXfesg
— Mario (@tejAA_PK) September 29, 2025
#BoyCottKantarachapter1#boycottkantarachapter1 “You disrespected our Telugu top hero with boycotts & torn posters. Now face the same heat — Boycott Kantara Chapter 1 🚫✊” pic.twitter.com/ogqol5zz1o
— saideep_ofl (@saistar01) September 29, 2025
2022లో వచ్చిన 'కాంతార' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' తెరకెక్కించారు. మూవీకి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించగా... రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో అక్టోబర్ 2న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















