Upcoming Telugu Movies: రిషబ్ 'కాంతార' To ధనుష్ 'ఇడ్లీ కొట్టు' - మూవీ లవర్స్‌కు దసరా పండుగే... ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే మూవీస్ లిస్ట్ ఇదే!
This Week Telugu Movies: దసరా సందర్భంగా ఈ వారం వినోదాల విందు అందించేందుకు మూవీస్, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ రిలీజ్ కానుంది. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...

This Week Latest Telugu Movies In Theaters OTT Releases: ఈ దసరా పండుగకు మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఇటు థియేటర్స్ అటు ఓటీటీలు రెడీ అయ్యాయి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్ 'కాంతార చాప్టర్ 1' నుంచి తమిళ స్టార్ ధనుష్ 'ఇడ్లీ కొట్టు' మూవీ సైతం రిలీజ్ కానున్నాయి. ఇక ఓటీటీల్లో దాదాపు 15 కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి.
'కాంతార చాప్టర్ 1'
2022లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన మూవీ 'కాంతార'. దీనికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా... అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. ఓ మట్టి కథ, అసాధారణ ప్రేమ కథ, శివయ్య నేపథ్యం, భారీ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కలగలపి మూవీని అద్భుతంగా రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
Also Read: కామెడీ అనకొండ కలెక్షన్లు రాబడుతుందా? సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫస్ట్ హిట్ మేజిక్ రిపీట్ చేస్తుందా?
ధనుష్ 'ఇడ్లీ కొట్టు'
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కొట్టు'. నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. డాన్ పిక్చర్స్ సంస్థ మూవీని నిర్మించగా... అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తన ఉద్యోగాన్ని వదిలి తండ్రి వారసత్వం కోసం ఇడ్లీ కొట్టు నడిపే ఓ యువకుని కథే ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్టోరీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఓటీటీల్లో వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు
- సెప్టెంబర్ 30 - జూనియర్ (నమ్మాఫ్లిక్స్), నైట్ మేర్ ఆఫ్ నేచుర్ (నెట్ ఫ్లిక్స్), కాట్ స్టీలింగ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), డౌన్ టౌన్ అబ్బే (అమెజాన్ ప్రైమ్ వీడియో), రాబిట్ ట్రాప్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), స్పైనల్ ట్రాప్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో), సస్పెండెడ్ టైమ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), టిన్ సోల్జర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది టాక్సిక్ అవెంజర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
- అక్టోబర్ 1 - మదరాసి (అమెజాన్ ప్రైమ్ వీడియో), లిటిల్ హార్ట్స్ (ఈటీవీ విన్), సాహసం (సన్ నెక్స్ట్), ప్లే డర్టీ మూవీ (అమెజాన్ ప్రైమ్ వీడియో), అన్నపూరణి (జియో హాట్ స్టార్), ఈజెన్ అలీ (నెట్ ఫ్లిక్స్), రైవల్రీస్ (నెట్ ఫ్లిక్స్), థర్టీన్త్ (హిందీ సిరీస్ - సోనీ లివ్)
- అక్టోబర్ 2 - ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్ (సిరీస్ - నెట్ ఫ్లిక్స్), చెక్ మేట్ (Zee5), వింక్స్ క్లబ్: ది మ్యాజిక్ ఈజ్ బ్యాక్ (నెట్ ఫ్లిక్స్),
- అక్టోబర్ 3 - మాన్‌స్టర్: ది ఎడ్ గెయిన్ స్టోరీ (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), స్టీవ్ (నెట్ ఫ్లిక్స్), IF (నెట్ ఫ్లిక్స్), జెనీ (నెట్ ఫ్లిక్స్), డెలీరియమ్ (నెట్ ఫ్లిక్స్), ది న్యూ ఫోర్స్ (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), ది లాస్ట్ బస్ (యాపిల్ టీవీ ప్లస్), ప్రిమిటివ్ వార్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), షెల్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది త్రీసమ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), వర్ వాల్వ్స్ - HULU, బ్రింగ్ హెర్ బ్యాక్ (HBO మ్యాక్స్)





















