Tillu Square Trailer: 'టిల్లు స్క్వేర్' ట్రైలర్ వచ్చేసింది - లిల్లి దెబ్బకు చుక్కలు చూసిన టిల్లు
Tillu Square Trailer: "ఆహా ఇట్ల నవ్వే.. మా బతుకు నవ్వులపాలు చేస్తారు.. పోయిన సారి కంటే ఈసారి నాకు గట్టిగా తగిలేట్టుంది దెబ్బ.. " అనే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.
Tillu Square Movie Trailer:రెండేళ్ల క్రితం యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన 'డీజే టిల్లు' మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. రాధిక రాధిక అంటూ సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్స్ లో చేసిన రచ్చని యూత్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మేకర్స్ సీక్వెల్ ని ప్రకటించి ‘టిల్లు స్క్వేర్’ టైటిల్ ని ఖరారు చేశారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్, సాంగ్స్, టీజర్ బాగా ఆకట్టుకున్నాయి.
ఇక మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రేమికుల రోజు సందర్భంగా ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్‌ను నేడు విడుదల చేసింది మూవీ టీం. చెప్పినట్టుగానే శ్రీరాములు థియేటర్లో ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వస్తుంది. టిల్లు స్క్వైర్ లోనూ సిద్దూ జొన్నలగడ్డ తన మార్క్ చూపించాడనిపిస్తుంది. ఇందులో అతని డైలాగ్ డెలివరి, కామెడీ పంచ్‌లతో రెచ్చిపోయాడు. ఇక అనుమప పరమేశ్వర్ ఫుల్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది.
ట్రైలర్ ఎలా ఉందంటే..
అంచనాలు మించి ట్రైలర్ సాగింది. సిద్దు ఎంట్రీతోనే ట్రైలర్ మొదలైంది. ముఖానికి బ్లాక్ ఫేస్ ప్యాక్ వేసుకొని 'టిల్లు స్క్వేర్'గా ఎంట్రీ ఇచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. అతడికి బంధువులు పెళ్లి సంబంధం తీసుకొస్తే.. టిల్లు రాధికను గుర్తు చేసుకుంటారు. బాంబు చికెన్ తిందామని చెప్పి.. రాధిక చికెన్ తిని.. బాంబూ నా నోట్లో పెట్టిందని టిల్లు తనదైన స్టైల్లో డైలాగ్ వదిలాడు. ఆ తర్వాత లిల్లీతో(అనుపమ పరమేశ్వరన్) కారులో లిప్ లాక్ సీన్. "పోయిన సారి కంటే ఈసారి నాకు గట్టిగా తగిలేట్టుంది దెబ్బ.. ఆహా ఇట్ల నవ్వే.. మా బతుకు నవ్వులపాలు చేస్తారు" అనే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. ఆ తర్వాత "మీ బాధలన్నీ విని.. మీ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్‌లా ఫీలై.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసేందుకు టిప్పు సుల్తాన్‍లాగా మధ్యలో దూరి.. మళ్లీ లాస్టులో నేనే ఫీలై.. మీకు డిస్కౌంట్ ఇచ్చి.. నేను షాప్ మూసుకునుడేంది" అని లిల్లీతో టిల్లు చెప్పిన తీరు ఫన్నీగా ఉంటుంది.
ఇలా టిల్లు స్క్వేర్‌లోనూ ఊహించని ట్విస్ట్‌లు ఉండబోతున్నాయని,లిల్లీ వల్ల టిల్లు చిక్కుల్లో పడినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత చివర్లో "టిల్లు కారణజన్ముడని.. లేడీస్ సమస్యలన్నీ తలమీదికి తెచ్చుకుంటాడు" అనే ఫన్నీ డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది. ఇలా ఆద్యాంతంగా ఫన్నీగా, ఆసక్తిగా సాగింది ట్రైలర్. మొత్తానికి టిల్లు స్క్వేర్‌లోనూ సిద్ధూ జొన్నలగడ్డ తన మార్క్ చూపించాడు. తనదైన డైలాగ్ డెలివరీలో సిద్ధు మరోసారి దుమ్మురేపాడు. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్లు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి ట్యూన్స్ అందించగా.. తమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍ను అందించాడు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ ఈ చిత్రంలో నటించారు. ప్రణీత్ రెడ్డి, మురళీశర్మ కూడా కీ రోల్లో నటించారు.
Also Read: బ్యాడ్‌న్యూస్ చెప్పిన హృతిక్ రోషన్ - నిరాశలో తారక్ ఫ్యాన్స్, 'వార్ 2' షూటింగ్‌కి బ్రేక్?