Hrithik Roshan: బ్యాడ్‌న్యూస్ చెప్పిన హృతిక్ రోషన్ - నిరాశలో తారక్ ఫ్యాన్స్, 'వార్ 2' షూటింగ్‌కి బ్రేక్?
Hrithik Roshan: మరికొద్ది రోజుల్లో జూ. ఎన్టీఆర్ 'వార్ 2 'సెట్ లో అడుగుపెడతాడని ఆనందిస్తున్న ఫ్యాన్స్ కి హృతిక్ రోషన్ బ్యాడ్‌న్యూస్ చెప్పాడు. ఆయన పోస్ట్ చూసి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hrithik Roshan Injuried: ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'వార్ 2'. ఈ మూవీ ఆస్కార్ గెలిచిన అనంతరం సైన్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్. వార్ 2తో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే హిందీలో యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన వార్ ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, గ్రీకు దేవుడు హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు అంతకు మించి అనేలా ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ భాగం అయ్యాడు. ఈ ఇద్దరి హీరోల కాంబోలో సినిమా అనగానే నార్త్, సౌత్ ఆడియన్స్‌లో క్యూరియసిటీ నెలకొంది.
మార్చిలో ఎన్టీఆర్ ఎంట్రీ
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఇటీవల స్పెయిన్‌లో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కానీ, ఇంకా తారక్ మాత్రం 'వార్ 2' సెట్లో అడుగు పెట్టలేదు. దీంతో ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు మూవీ సెట్లో అడుగుపెడతాడా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ మార్చి మొదటి వారంలో షూటింగ్లో పాల్గొంటాడనే అప్డేట్ బయటకు వచ్చింది. ఇక తమ హీరోను చూసేందుకు ఇంకా కొద్ది రోజులే ఉందని ఫ్యాన్స్ అంతా ఆనందిస్తున్న క్రమంలో హృతిక్ రోషన్ బ్యాడ్‌న్యూస్ చెప్పాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేసి తను గాయపడినట్టు వెల్లడించాడు. ఈ ఫొటోలో హృతిక్ నడుముకి బెల్డ్ బెట్టుకుని, రెండు చేతుల కింద క్లచస్ సపోర్టుతో నిలబడి ఉన్నాడు. దీంతో 'వార్ 2' షూటింగ్లో హృతిక్ గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో కొద్ది రోజుల పాటు తనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట.
View this post on Instagram
గాయపడ్డ హృతిక్
ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న హృతిక్ తన ఫొటో షేర్ ప్రస్తుతం కోలుకుంటున్నానని, త్వరలోనే పున:శక్తితో తిరిగి వస్తానంటూ పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు. ఇది చూసి హృతిక్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ అతడి పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు తారక్ ఫ్యాన్స్ మాత్రం వర్రీ అవుతున్నారు. తమ అభిమాన హీరోని ఎప్పుడెప్పుడు వార్ 2 సెట్లో చూస్తామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి డిస్సపాయింట్ అవుతున్నారు. ఇప్పట్లో తారక్ వార్ 2 షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదా? అని ఆరా తీస్తున్నారు. కాగా హృతిక్ గాయపడటంతో షూటింగ్ బ్రెక్ పడినట్టు తెలుస్తోంది. అతడు లేకుండ షూటింగ్ కంటిన్యూ చేయడమనేది కుదరని పని. ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్‌ది విలన్ రోల్ అని తెలుస్తుంది.
Also Read: నటితో 'భాగమతి' హీరో పెళ్లి? - క్లారిటీ ఇచ్చిన నటుడు
వార్ 2 షూటింగ్ కి బ్రేక్?
విలన్ కనిపించాలంటే ఖచ్చింతంగా హీరో ఉండాల్సిందే కదా. ఇప్పుడు హృతిక్ గాయంతో రెస్ట్ తీసుకుంటున్నాడంటే.. తారక్ సెట్లో అడుగపెట్టడానికి మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. మరి దీనిపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దాదాపు దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా అయిపోతాడు. 'వార్ 2' అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కావడంతో హృతిక్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ పొందాల్సి ఉంటుంది. కాబట్టి అతడు పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయంలో పట్టేలా ఉంది. అంటే 'వార్ 2' సెట్లో ఎన్టీఆర్‌ను చూడాలంటే మరిన్ని నెలలు వేచి చూడాల్సిందేనా? అని ఫ్యాన్స్ అంతా వర్రీ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం తెరకెక్కితున్న ఈ సినిమాను YRF Spy Universe బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.