Tribanadhari Barbarik Song: చాలా గ్యాప్ తర్వాత సిద్ శ్రీరామ్ నుండి ప్రేమ గీతం... ఏం అవుతున్నదో మరి!
తనదైన వాయిస్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిద్ శ్రీరామ్.. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తన వాయిస్‌తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ‘త్రిబాణధారి బార్భరిక్’లో ఆయన పాడిన పాట వైరల్ అవుతోంది.

సిద్ శ్రీరామ్ సందడి ఈ మధ్య కాస్త తగ్గింది కానీ... ఒకట్రెండు సంవత్సరాల వెనక్కి వెళితే, ఎక్కడ చూసినా సిద్ శ్రీరామ్ పాటే. ఆయన వాయిస్ గురించి అంతా చర్చలే. కానీ కొన్నాళ్లగా ఆయనకు తెలుగులో సరైన పాట పడలేదు. అందులోనూ కొత్త కొత్త సింగర్స్ వస్తుండటంతో మ్యూజిక్ డైరెక్టర్స్ వారిని ఎంకరేజ్ చేసే పనిలో ఉండటంతో సిద్ శ్రీరామ్ కన్సర్ట్‌లు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. మళ్లీ ఆయనని బిజీ చేసే సాంగ్ ‘త్రిబాణధారి బార్భరిక్’లో పడింది. తాజాగా ఈ మూవీ నుండి వచ్చిన పాట.. మరోసారి సిద్ శ్రీరామ్ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఈ చిత్రంలో ఆయన పాడిన పాట విషయానికి వస్తే..
‘‘ఏం అవుతున్నదో.. నా గుండెలో ఉండుండి ఈ రోజిలా..
ఏం దాచుంచావో.. ఆ కళ్లలో నిలువెల్లా మునిగానిలా..
ఈ సంగతే నచ్చింది చాలా.. నీ సందడే నా లోపల..
ఈ హాయినే మోయాలి అంటే.. ఎలా ఎలా..
నీవల్లే నీ వల్లే ఈ మాయె నీవల్లే.. కళ్లోనూ కళ్లోలాలే నీవల్లే..
నీవల్లే నీవల్లే ఆనందం నన్నల్లే.. మొత్తంగా మరిచాను నా నిన్నలే
నీవల్లే నీవల్లే వెన్నెల్లో వర్షాలే.. నాపైనే కురిశాయిలే నీ వల్లే
నీవల్లే నీవల్లే వేవేల వర్ణాలే.. నాచుట్టూ వాలాయిలే నీ వల్లే’’ అంటూ సాగిన ఈ పాట సిద్ శ్రీరామ్ వాయిస్‌లో వినసొంపుగా ఉంది. ఈ పాటకు రఘురాం అందించిన లిరిక్స్, సిద్ శ్రీరామ్ సింగింగ్ మేజర్ హైలైట్ అనేలా ఉన్నాయి. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా పాటను బాగా హైలెట్ చేస్తోంది. అలాగే సాంగ్ లో కనిపిస్తున్న సీన్స్ చూస్తుంటే.. ఈ పాట యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అందుకే, విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: 'మాస్ జాతర' తర్వాత రవితేజ సినిమా ఫిక్స్... సమ్మర్‌లో సెట్స్ మీదకు, దర్శకుడు ఎవరంటే?
‘త్రిబాణధారి బార్భరిక్’ విషయానికి వస్తే... ఈ మధ్య కాలంలో యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. థియేటర్లలో కాకపోయినా.. ఇలాంటి సినిమాలకు ఓటీటీలలో చాలా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే మేకర్స్ ఇలాంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నయా దర్శకనిర్మాతల థాట్స్, ప్రెజెంటేషన్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే బాటలో ‘త్రిబాణధారి బార్భరిక్’ అంటూ సరికొత్త పాయింట్‌తో రాబోతోన్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ పెంచగా.. తాజాగా వచ్చిన ‘నీవల్లే’ సాంగ్ కూడా యూత్‌ని ఆకర్షించేలా ఉంది.
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల ఈ ‘త్రిబాణధారి బార్భరిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని.. త్వరలోనే గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా చిత్రయూనిట్ తెలిపింది.





















